తెలుగు చిత్ర సీమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ పాటల రచయిత గురు చరణ్ తాజాగా తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయసు 77 సంవత్సరాలు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గురు చరణ్ గురువారం ఉదయాన్నే కన్ను మూసినట్టుగా సమాచారం. టాలీవుడ్ లో హిట్ పాటల రచయితగా మంచి పేరు తెచ్చుకున్న గురు చరణ్ అసలు పేరు ఇప్పటి తరం మూవీ లవర్స్ లో చాలా మందికి తెలియదని చెప్పాలి. ఆయన అసలు పేరు మానపురం రాజేంద్రప్రసాద్. ఇక ఆయన బ్యాక్ గ్రౌండ్ కూడా సినిమాకు సంబంధించిందే కావడం విశేషం. 


సినిమా బ్యాక్ గ్రౌండ్ నుంచి రచయితగా ఎంట్రీ 
ఒకప్పటి ప్రముఖ దర్శకుడు మానపురం అప్పారావు కుమారుడు గురు చరణ్. ఆయన తల్లి కూడా నటే. ప్రముఖ నటి ఎంఆర్ తిలకం ఆమె పేరు. ఇక సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ ఆయన హీరోగా కాకుండా గీత రచయితగా టాలీవుడ్ లో స్థిరపడ్డారు. ఎంఏ చదివిన గురు చరణ్ అలనాటి లెజెండరీ సాంగ్ రైటర్ ఆచార్య ఆత్రేయ దగ్గర పాఠాలు నేర్చుకున్నారు. ఆయన దగ్గర శిష్యరికం చేశాక టాలీవుడ్ లోకి పాటల రచయితగా అడుగు పెట్టి ఇప్పటిదాకా 200 సినిమాలకు పైగా ఆయన లిరిక్ రైటర్ గా పని చేశారు. ఇక గురుచరణ్ రాసిన పాటల విషయానికి వస్తే... లిస్ట్ లో ముద్దబంతి పువ్వులో మూగ భాసలు, బోయవాని వేటుకు గాయపడిన కోయిల, కుంతీ కుమారి తన కాలు జారి వంటి టాలీవుడ్ ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ ఉంటాయి. 


Read Also: నా లవ్ బ్రేకప్ కు కారణం ఆవిడే... బిగ్ బాస్ యాష్మీ గౌడ షాకింగ్ కామెంట్స్


మోహన్ బాబుతో ప్రత్యేక అనుబంధం... 
ఎంతో మంది స్టార్ హీరోలకు తెలుగు సినిమాలలో ఆయన ఎన్నో రాసిన విషాద గీతాలు ఎవర్ గ్రీన్ సాంగ్స్ గా నిలిచాయి. అయితే అందరు హీరోల కంటే మోహన్ బాబు కోసం ఆయన రాసిన పాటలు ప్రత్యేకంగా నిలిచాయి. మోహన్ బాబు కూడా తాను సినిమా చేస్తున్నాను అంటే ప్రత్యేకంగా గురు చరణ్ అందులోకి తీసుకునేవారట. ఇప్పటికీ మోహన్ బాబు సినిమాలంటే "ముద్దబంతి పువ్వులో మూగనోములు" అనే పాట గుర్తొస్తుంది, వింటుంటే మనసుకు హాయిగా ఉంటుంది అంటే మూవీ లవర్స్ పై గురు చరణ్ రాసిన పాటల ప్రభావం ఎంతగా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మోహన్ బాబు సినిమాలు కొన్ని బ్లాక్ బస్టర్ హిట్ కావడానికి గురు చరణ్ రాసిన పాటలు కూడా ఒక కారణమని చెప్పాలి. అందుకే మోహన్ బాబు తాను నటించిన సినిమాలలో లిరిక్ రైటర్ గురు చరణ్ తో ఒక్క పాట అయినా తప్పకుండా రాయించుకునే వారట. ఆయన అలా చేయడం వల్ల మోహన్ బాబు కెరీర్లో చిరస్థాయిగా నిలిచిపోయిన సినిమాలు, మరిచిపోలేని కొన్ని మెలోడీ, అర్థమంతమైన పాటలు ఉన్నాయి. అవి ఇప్పటికీ శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. కానీ ఇప్పుడు ఆయన ఇక లేరన్న విషయం టాలీవుడ్ సినీ ప్రముఖులను దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. గురు చరణ్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, పాటల లవర్స్ సోషల్ మీడియా వేదికగా సంతపాన్ని తెలియజేస్తున్నారు. ఆయన లేని లోటు తెలుగు సినీ పరిశ్రమకు తీరనిది అని చెప్పొచ్చు.


Read Also: వాళ్లిద్దరూ తేనెపూసిన కత్తులు... హౌస్ నుంచి బయటకు వచ్చాక బేబక్క షాకింగ్ కామెంట్స్