Bigg Boss Yashmi Gowda Love Break Up: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8  ప్రేక్షకులు కావాల్సినంత వినోదాన్ని పంచుతున్నది. నవంబర్ 1న ప్రారంభం అయిన ఈ షో ఇప్పటికే 10 రోజులు పూర్తి చేసుకుంది. తొలి వారం బెజవాడ బేబక్క షో నుంచి ఎలిమినేట్ కాగా, ప్రస్తుతం హౌస్ లో 13 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. ఇందులో కన్నడ బ్యూటీ యాష్మీ గౌడ చక్కటి ఆటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో అమ్మడు బ్యాగ్రౌండ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆడియెన్స్. యాష్మీ ఎవరు? ఇండస్ట్రీలోకి ఎలా వచ్చింది? ప్రేమ, బ్రేకప్ గురించి ఆరా తీస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే తన ప్రేమకు బ్రేకప్ చెప్పాల్సి వచ్చిందని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.   


లవ్ బ్రేకప్ కు కారణం అబ్బాయి వాళ్ల అమ్మ- యాష్మీ


సాధారణంగా లవ్ బ్రేకప్ అనేది అమ్మాయి, అబ్బాయికి మధ్య గొడవల కారణంగా జరుగుతుంది. కానీ, తమ బ్రేకప్ కు అబ్బాయి వాళ్ల అమ్మ కారణం అయ్యిందని వెల్లడించింది. “నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే లవ్ బ్రేకప్ అయ్యింది. వాళ్ల అమ్మకు నేను ఇండస్ట్రీలో ఉండటం ఇష్టం లేదు. ఇదే విషయాన్ని తను నాకు చెప్పాడు. “మా అమ్మకు నువ్వు ఇండస్ట్రీలో ఉండటం నచ్చట్లేదు. మనం దూరంగా ఉందాం” అన్నాడు. నేను పెద్దగా ఆలోచించలేదు. సరే అన్నాను. కొద్ది రోజులు కాస్త బాధగా అనిపించింది. ఆ తర్వాత బయటకు వచ్చేశాను. షూటింగ్స్ లో బిజీ అయ్యాను. కేవలం అతడితో ఒక ఏడాది లవ్ లో ఉన్నాను. సడెన్ గా తను నన్ను అవాయిడ్ చేయడం మొదలు పెట్టాడు. ఎందుకు నన్ను దూరం పెడుతున్నావు అని అడిగాను. అతడు అసలు విషయం చెప్పాడు. నేను ప్రేమించమని ఒత్తిడి చేయలేను కదా.? అందుకే సరే అన్నాను” అని చెప్పుకొచ్చింది.






ఇంతకీ ఎవరీ యాష్మీ గౌడ


యాష్మీ గౌడ ఆగష్టు 30 1995లో బెంగళూరులో పుట్టి పెరిగింది. ఈ 28 ఏండ్ల ముద్దుగుమ్మకు చిన్నప్పటి నుంచే సంగీతం అంటే ఇష్టం. స్కూలింగ్ లోనే మోడలింగ్ లోకి అడుగు పెట్టింది. నెమ్మదిగా ‘విద్యా వినాయక’ అనే కన్నడ సీరియల్ లో అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత తెలుగు బుల్లితెరపైకి అడుగు పెట్టింది. ‘స్వాతి చినుకులు’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పలు సీరియల్స్ లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘కృష్ణ ముకుంద మురారి’ సీరియల్ లో ఆడియెన్స్ కు మరింత దగ్గరైంది. ఈ సీరియల్ లో  ముకుంద అనే నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ తో అద్భుతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం బిగ్ బాస్ కంటెస్టెంట్ గా మంచి ఆటతీరుతో పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకుంటోంది.   



Read Also: నామినేషన్స్​లో యశ్మీకి అదిరే పవర్ ఇచ్చిన బిగ్​బాస్.. ఏడ్చేసిన నైనిక.. ఓదార్చిన నిఖిల్.. సరికొత్త టాస్క్​ ఊహించని ట్విస్ట్​తో