Bigg Boss Game Changing Twist : బిగ్‌బాస్ తెలుగు 8 డే 9 (Bigg Boss Telugu 8 Day 9 Promo 2) నుంచి రెండో ప్రోమో విడుదల చేసింది స్టార్ మా. అయితే ప్రోమోతో నామినేషన్స్ కంటిన్యూ అయినట్లే కనిపిస్తుంది. ఎందుకంటే వీటితో పాటు మరో టాస్క్‌ని బిగ్‌బాస్ ఇచ్చాడు. ఇంతకీ ప్రోమో ఎలా రన్ అయింది. ఈ వారం నామినేషన్స్‌లో ఎవరెవరు ఉన్నారు? బిగ్‌బాస్ ఇచ్చిన న్యూ టాస్క్ ఏమిటి వంటి విషయాలు ఇప్పుడు చూసేద్దాం.
ఇన్‌డైరక్ట్‌గా డస్ట్‌బిన్..
సోనియా ఎఫెక్ట్ నిఖిల్ మీద పడిందో.. లేదా ముందు సీజన్లో సీరియల్ గ్రూప్ అనే ట్యాగ్‌ని వద్దనుకున్నాడో ఏమో కానీ.. నిఖిల్ తన మొదటి నామినేషన్‌ను ప్రేరణకు వేశాడు. ఫస్ట్ నామినేషన్‌ను నేను ప్రేరణకు ఇస్తాను అని తెలిపాడు. దీంతో ప్రేరణ డస్ట్ బిన్ గురించేనా అని అడుగగా.. పృథ్వీ గట్టిగా నవ్వాడు. దానికి నిఖిల్ కాదు అంటూ.. టాస్క్ సమయంలో నువ్వు డ్యూయాలిటీని చూపించావని చెప్పాడు. ఓహ్.. అయితే ఇది ఇన్‌డైరక్ట్‌గా డస్ట్ బిన్ గురించే అంటూ ప్రేరణ రిప్లై ఇచ్చింది.
అసలు అది రీజనే కాదు..
నబీల్ తన నామినేషన్‌గా పృథ్వీని ఎంచుకున్నాడు. కొంచెం కేర్ లెస్ నెస్‌గా ఉన్నావు. ఇర్రెస్‌పాన్స్‌బుల్‌గా ఉన్నావు. ఈ రెండు విషయాల వల్లనే నేను నిన్ను నామినేట్ చేస్తున్నానంటూ చెప్పాడు. దానికి పృథ్వీ అది రీజనే కాదంటూ డిఫెండ్ చేశాడు. తర్వాత వచ్చిన నైనిక.. నాకు వాయిస్ ఉందని ప్రూవ్ చేయడానికి రాలేదు.. పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉందని రాలేదు అంటూ చెప్పింది. యశ్మీ.. నేనున్నాను.. నాకు టైమ్ వస్తుంది నేను మాట్లాడతాను అంటూ చెప్పగా.. పృథ్వీ మా మీరే తప్పు అనిపిస్తున్నారు.
మా క్లాన్ అనిపించట్లేదని చెప్పాడు. ప్రేరణ మా క్లాన్‌కి క్లారిటీ ఉంది కాబట్టి మేమేదో చేసుకున్నామంటూ రిప్లై ఇవ్వగా నైనిక.. ప్రేరణను నామినేట్ చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బిగ్‌బాస్‌లో ఎవరిని నామినేట్ చేయాలో తెలియదు. ఎందుకు నామినేట్ చేయాలో తెలియదు అంటూ పృథ్వీ వత్తాసు పలికాడు.
యశ్మీ నామినేషన్
యశ్మీ ఈ వారం నామినేషన్లో ఉండదని ముందుగానే చెప్పిన బిగ్‌బాస్ ఆమె నామినేషన్ వేసేందుకు ఓ ట్విస్ట్ ఇచ్చాడు. ఆమెకు స్పెషల్ పవర్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఆమెకు నామినేట్ అయిన సభ్యుల్లోంచి ఒకరిని సేవ్ చేసి.. నామినేట్ కానీ వ్యక్తిని నామినేషన్స్‌లో ఉంచొచ్చని స్పెషల్ పవర్ ఇచ్చాడు. మనకంటే ముందు పోవాల్సిన వాళ్లు చాలా మంది ఉన్నారు. వాళ్లు పోయేవరకు మనం సేఫేనంటూ సోనియా చెప్పింది.
నామినేషన్స్ తర్వాత నిఖిల్, నైనిక, మణికంఠ మాట్లాడుకుంటూ ఉండగా.. నిఖిల్ నేను ఈ వారం వెళ్లిపోయినా అనగానే.. మణికంఠ పిచ్చిలేసిందా మీ ఇద్దరికీ.. నేను మిమ్మల్ని టాప్ 10లో చూస్తున్నానంటూ చెప్పాడు. కిచెన్‌లో శేఖర్ బాష.. సోనియాతో వాళ్లనేమో మంచిగా చూపించి.. నన్ను బ్యాడ్ చేశాడంటూ చెప్పుకున్నాడు. బెడ్ రూమ్‌లో నైనిక ఏడుస్తుంటే సోనియా వచ్చి ఓదార్చినట్లు ప్రోమోలో చూపించారు.
ట్విస్ట్? టాస్క్..?
కంటెస్టెంట్లు అందరూ హాల్ కూర్చొని ఉండగా.. ఈ సీజన్లో ట్విస్ట్‌లు ఉంటాయని మొదట్లోనే చెప్పామని బిగ్‌బాస్ గుర్తు చేశాడు. దానిలో భాగంగా మీ దగ్గర ఉన్న ఆహార పదార్థాలు స్టోర్ రూమ్‌లో పెట్టండంటూ బిగ్‌బాస్ ఆదేశించాడు. వారంతా ఫుడ్ లోపల పెట్టి రాగానే.. మీ అందరికీ కొంత సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈలోగా ఏమి తినాలనుకుంటే అది తినేయండి అంటూ మరో ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో అందరూ పరుగున వెళ్లి నచ్చిన ఫుడ్ తిన్నారు. ఆదిత్య ఓం మాత్రం సోఫాలోనే ఉన్నాడు. అనంతరం బజర్ మోగడంతో ప్రోమో ఎండ్ అయింది.