Samantha's Maa Inti Bangaram New Update: స్టార్ హీరోయిన్ సమంత మూవీస్‌కు కాస్త గ్యాప్ ఇచ్చారు. 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్' ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి 'శుభం' మూవీని నిర్మించి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం 'రక్త్ బ్రహ్మాండ్' సిరీస్‌లో నటిస్తుండగా... 'మా ఇంటి బంగారం' మూవీ అనౌన్స్ చేసి కూడా చాలా కాలం అయ్యింది.
గతంలో టైటిల్ లుక్ విడుదల చేసినా ఇప్పటివరకూ దీనిపై ఎలాంటి అప్డేట్ లేదు. గతంలో ఓ ఈవెంట్‌లో జూన్ నుంచి ఈ మూవీ ట్రాక్‌లోకి ఎక్కనుందని సమంత స్వయంగా ప్రకటించినా అది కూడా కార్యరూపం దాల్చలేదు. తాజాగా ఈ ప్రాజెక్టుపై ఓ క్రేజీ బజ్ వైరల్ అవుతోంది.
ఆ స్టార్ డైరెక్టర్‌తో
'మా ఇంటి బంగారం' మూవీకి స్టార్ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన 'ఓ బేబీ' మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఇప్పుడు అదే హిట్ కాంబో రిపీట్ కానుండడంతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది. అలా మొదలైంది, కల్యాణ వైభోగమే, అన్నీ మంచి శకునములే మూవీస్‌తో నందిని రెడ్డి మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇప్పుడు అదే రేంజ్‌లో ఈ మూవీ కూడా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం త్వరలోనే ఇద్దరూ సెట్స్‌లోకి అడుగు పెట్టబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.
Also Read: ఓ వీడియో గేమ్... రాయలసీమ నుంచి ప్రపంచం అంతం - తేజ సజ్జ 'జాంబీ రెడ్డి' సీక్వెల్ అనౌన్స్
స్టోరీ అదేనా?
గతంలో ఎన్నడూ చూడని ఓ డిఫరెంట్ రోల్‌లో సమంతను ఈ మూవీలో చూడబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె రోల్ పూర్తిగా యాక్షన్ రోల్‌లో ఉండబోతున్నట్లు గతంలో రిలీజ్ చేసిన టైటిల్ లుక్‌ను బట్టి అర్థమవుతోంది. 1980ల నేపథ్యంలో సాగే ఓ క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌గా 'మా ఇంటి బంగారం' తెరకెక్కించనున్నారనే టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఇతర యాక్టర్స్, టెక్నికల్ టీం వివరాలు వెల్లడి కానున్నాయి. సమంత చాలా రోజుల తర్వాత ఓ డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ లుక్‌తో వస్తుండడంతో ఫ్యాన్స్‌లో ఆసక్తి డబుల్ అవుతోంది.
'శుభం' సినిమాకు నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా ఆ మూవీలో గెస్ట్ రోల్‌లో నటించి ఆకట్టుకున్నారు సమంత. ఇక... సామ్ రామ్ చరణ్ 'పెద్ది' మూవీలో ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించనున్నారంటూ ఓ వార్త ఫిలిం నగర్ సర్కిల్‌లో చక్కర్లు కొట్టింది. ఆ మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పుడే సమంత కూడా నటించబోతున్నారంటూ ఓ వార్త వైరల్ కాగా దానిపై క్లారిటీ రాలేదు. ఇప్పుడు స్పెషల్ సాంగ్‌లో ఆమె కనిపించనున్నారని తెలుస్తుండగా... ఇంతవరకూ మూవీ టీం నుంచి ఎలాంటి స్పందన లేదు. నిజానికి సమంత గత మూడేళ్లుగా ఎలాంటి మూవీ చేయలేదు. 'శుభం'లో క్యామియో రోల్ తర్వాత వెబ్ సిరీస్‌ల్లో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే 'మా ఇంటి బంగారం' అనౌన్స్‌మెంట్ రాగా ఎట్టకేలకు అప్డేట్ వచ్చింది. ఆమెను డిఫరెంట్ రోల్‌లో సిల్వర్ స్క్రీన్‌పై మళ్లీ చూడాలంటూ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.