Tollywood Srikanth Bharat Sensational Comments On Gandhi: ఫాదర్ ఆఫ్ ది నేషన్ మహాత్మా గాంధీపై టాలీవుడ్ యాక్టర్ శ్రీకాంత్ భరత్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. గాంధీ జయంతి సందర్భంగా తాను పెట్టిన ఓ పోస్టుకు నెటిజన్ల రియాక్షన్‌పై స్పందిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు. గాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Continues below advertisement


ఆయన ఏమన్నారంటే?


తాను ఏ పోస్ట్ పెట్టినా కామెంట్స్ వస్తాయని అయితే వేటినీ పెద్దగా పట్టించుకోనని వీడియోలో చెప్పారు నటుడు శ్రీకాంత్ భరత్. 'అక్టోబర్ 2 గురించి పోస్ట్ పెడితే కొందరు తీవ్రంగా విమర్శించారు. మీకేం తెలుసురా? గాంధీ ఎంతోమందిని లైంగికంగా వేధించాడు. వాడు మహాత్ముడా?. ఆత్ముడు. స్వాతంత్ర్యం ఆయన తేలేదు. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ వంటి వారు తీసుకొచ్చారు. వాళ్లు పరమాత్ములు. ఆయన జాతిపిత కాదు. భరతమాత అనే వ్యక్తులం మేము. జాతిపిత ఏంటి జాతిపిత. గాంధీ మహాత్ముడే కాదు.' అంటూ కామెంట్స్ చేశారు. 


ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ అవుతుండగా... నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. గాంధీపై అసభ్యకర కామెంట్స్ చేసిన నటుడిపై ఫైర్ అవుతున్నారు. అతనిపై చర్యలు తీసుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు నెటిజన్లు చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులను ట్యాగ్ చేస్తున్నారు. కొంతమంది ఇది ఓల్డ్ వీడియో అని ఆయన ఎప్పుడో చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుందని అంటున్నారు. మరి దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఏది ఏమైనా గాంధీపై అలా కామెంట్స్ చేయడం సరి కాదని అంటున్నారు. శ్రీకాంత్ భరత్ తెలుగులో పలు మూవీస్‌లో గెస్ట్ రోల్స్, కొన్ని సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్నారు.


అయితే, గాంధీ జయంతి సందర్భంగా మరో టాలీవుడ్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ సైతం చేసిన కామెంట్స్ విమర్శలు దారి తీశాయి. 'గాంధీ సాధువు కాదు. మహాత్ముడు కాదు' అంటూ కామెంట్ చేయగా నెటిజన్లు తీవ్ర విమర్శలు చేశారు. 






Also Read: దీపికాకు హీరోయిన్ 'త్రిప్తి డిమ్రి' సపోర్ట్ - 'స్పిరిట్' కాంట్రవర్శీ తర్వాత ఫస్ట్ రియాక్షన్