Triptii Dimri Reaction To Negative PR Against Deepika Padukone: ప్రభాస్ 'కల్కి 2898AD' సీక్వెల్ నుంచి తప్పించడంతో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోన్ ఇటీవల వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అంతకు ముందు స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్' మూవీ నుంచి కూడా ఆమెను తప్పిస్తూ... హీరోయిన్ త్రిప్తి డిమ్రిని సెలక్ట్ చేశారు. దీనిపై అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద చర్చే సాగింది. తాజాగా, దీపికాకు త్రిప్తి సపోర్ట్‌గా నిలిచారు.

Continues below advertisement

ఆ పోస్ట్‌కు లైక్

సోషల్ మీడియాలో దీపికా పదుకోన్‌పై నెగిటివ్ ప్రచారాన్ని ఖండిస్తూ ఆమె వర్క్ డెడికేషన్‌ను వివరిస్తూ చేసిన పోస్టుకు 'త్రిప్తి డిమ్రి' లైక్ కొట్టారు. దీపికా 'గోలియన్‌కి రాస్ లీలా రామ్ లీలా' పాటలో గంటల తరబడి షూటింగ్‌లో భాగంగా, 30 కిలోల దుస్తులు ధరించి... పాదాలు గాయపడినప్పటికీ ఎలాంటి కంప్లైంట్ లేకుండా డెడికేషన్‌తో షూటింగ్ పూర్తి చేశారు. ఇది దీపికా అంకితభావం, డెడికేషన్‌కు నిదర్శనం అంటూ పోస్ట్ చేయగా... దానికి త్రిప్తి డిమ్రి లైక్ కొట్టారు.

Continues below advertisement

దీంతో ఫ్యాన్స్, నెటిజన్ల నుంచి త్రిప్తి డిమ్రిపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇది ఇద్దరు హీరోయిన్ల మధ్య ఫ్రెండ్ షిప్ చూపించడమే కాకుండా పాజిటివిటీ పెరిగిందని అంటున్నారు. దీపికాపై నెగిటివ్ పబ్లిసిటీ చేయడం ఇకనైనా ఆపాలంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 'స్పిరిట్' కాంట్రవర్శీ తర్వాత త్రిప్తి డిమ్రి రియాక్ట్ కావడం ఇదే ఫస్ట్ టైమ్. ఇద్దరు హీరోయిన్ల మధ్య గ్యాప్ వచ్చిందన్న వార్తలకు ఒక్క లైక్‌తో చెక్ పెట్టారు.

Also Read: 'బాహుబలి 3'పై మేకర్స్ క్లారిటీ - 'బాహుబలి: ది ఎపిక్' క్లైమాక్స్‌లో బిగ్ సర్‌ప్రైజ్...

అసలు ఎపిసోడ్ ఏంటంటే?

'యానిమల్' డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో 'స్పిరిట్' మూవీ తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టులో ముందుగా దీపికానే అనుకున్నారు. అయితే, ఆమె స్థానంలో త్రిప్తి డిమ్రిని సెలక్ట్ చేశారు. దీంతో పెద్ద చర్చే సాగింది. వర్కింగ్ అవర్స్, రెమ్యునరేషన్ విషయంలో దీపికా స్ట్రిక్ట్ కండీషన్స్ పెట్టడంతో ఆమెను తప్పించి త్రిప్తి ఎంపిక చేశారనే ప్రచారం సాగింది. ఆ తర్వాత  తన స్టోరీని లీక్ చేశారంటూ ఇండైరెక్ట్‌గా దీపికాను ఉద్దేశించి సందీప్ పోస్ట్ కూడా చేశారు. 'కథ మొత్తం లీక్ చేసినా నాకేం పర్వాలేదు' అంటూ ట్వీట్ చేయగా వైరల్ అయ్యింది. దీపికా కూడా దీనిపై ఘాటుగానే స్పందించారు. 'తాను జీవితంలో నిజాయతీకే ఇంపార్టెన్స్ ఇస్తాను. క్లిష్ట పరిస్థితుల్లో నా మనసు చెప్పేదే వింటాను.' అంటూ రియాక్ట్ అయ్యారు. 

మరోవైపు, రీసెంట్‌గా మరో బిగ్ ప్రాజెక్ట్ ప్రభాస్ 'కల్కి 2898 AD' సీక్వెల్ నుంచి కూడా దీపికాను తప్పిస్తూ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. వర్కింగ్ అవర్స్, కండీషన్స్ వల్లే ఆమెను ఇంత పెద్ద ప్రాజెక్ట్ నుంచి కూడా తప్పించారనే వార్తలు వచ్చాయి. 'కల్కి'లో ఆమె సుమతి పాత్రలో నటించగా సీక్వెల్‌లోనూ ఆమె రోల్‌కు ప్రాధాన్యముంది. మరి ఆ రోల్‌లో ఎవరిని రీప్లేస్ చేస్తారనేది ప్రస్తుతం ఇంట్రెస్టింగ్‌గా మారింది.