Siddhu Jonnalagadda's Tillu Square Twitter Review In Telugu: స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన సినిమా 'టిల్లు స్క్వేర్'. ప్రపంచ వ్యాప్తంగా మార్చి 29న థియేటర్లలో విడుదల. ఏపీ, తెలంగాణ... తెలుగు రాష్ట్రాల్లో కంటే ముందు బెంగళూరులో ఒక షో పడినట్లు సమాచారం అందింది. అమెరికాలోని లొకేషన్లలో సైతం షోలు వేశారట. ఇక, హైదరాబాద్ సిటీలో కొందరు సినిమా చూశారు. వాళ్లు ఏం అంటున్నారు? సినిమా చూసిన జనాల టాక్ ఏంటి? అనేది ఆడియన్స్ రివ్యూలో ఒక్కసారి చూడండి. 


టిల్లన్న మేజిక్ రిపీట్... థియేటర్లలో నవ్విస్తాడు!
''టిల్లు స్క్వేర్ ఈజ్ విన్నర్'' అని ఓ నెటిజన్సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్ 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. అంటే... సినిమా హిట్ అని ఆయన చెప్పారన్నమాట. ''టిల్లు స్టైల్‌లో విపరీతంగా నవ్వించే సన్నివేశాలు ఉన్నాయి. టిల్లు మేజిక్ సినిమా అంతా రిపీట్ అయ్యింది. టిల్లన్న ఫన్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చాడు'' అని ఆ ఆడియన్ ట్వీట్ చేశారు.


Also Readఆడు జీవితం రివ్యూ: సౌదీలో కూలీల కష్టాలు చూడగలమా? - పృథ్వీరాజ్ సుకుమారన్ సినిమా ఎలా ఉందంటే?






అనుపమా పరమేశ్వరన్ ఫైర్!
బెంగళూరులో 'టిల్లు స్క్వేర్' స్పెషల్ షో చూస్తున్న ఒక నెటిజన్ అయితే హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఆమె ప్రేక్షకుల గుండెల్లో మంటలు పుట్టించడం ఖాయం అన్నట్లు ట్వీట్ చేశారు. టిల్లన్నకు మాత్రం దండం పెట్టేశారు. ఫస్టాఫ్ బావుందని చెప్పారు.


Also Read: ట్విస్ట్ ఇచ్చిన లవ్ బర్డ్స్ సిద్ధూ, అదితి... పెళ్లి కాదు కానీ పెళ్లికి ముందు ఓ అడుగు!






బ్లాక్ బస్టర్ అంటోన్న మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్!
'టిల్లు స్క్వేర్' మీద విడుదలకు ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. 'డీజే టిల్లు' హిట్ కావడం, సీక్వెల్ సాంగ్స్ & ట్రైలర్ ప్రేక్షకులకు నచ్చడంతో సూపర్బ్ బజ్ క్రియేట్ అయ్యింది. సినిమాకు రీ రికార్డింగ్ చేసిన భీమ్స్ ఆ అంచనాలను మరింత పెంచారు. ''నేను 'మ్యాడ్' చూసిన తర్వాత హిట్ అని చెప్పాను. ఇది 'మ్యాడ్'కు తాత... పక్కా బ్లాక్ బస్టర్'' అని భీమ్స్ తెలిపారు. 'మ్యాడ్' దర్శకుడు కళ్యాణ్ శంకర్ సైతం సినిమా చూశానని, ఇంటర్వెల్ సమయానికి బ్లాక్ బస్టర్ ఫీలింగ్ వస్తుందని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పేర్కొన్నారు.


Also Read: కాంట్రవర్షియల్ క్రిటిక్ మెచ్చిన క్రూ - ముగ్గురు హీరోయిన్స్ సినిమాకు 3 ప్లస్ రేటింగా!?



సిద్ధూ జొన్నలగడ్డ సరసన అనుపమా పరమేశ్వరన్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో 'డీజే టిల్లు'లో రాధికగా మెప్పించిన నేహా శెట్టి అతిథి పాత్రలో సందడి చేయనున్నారని తెలిసింది. 'డీజే టిల్లు' సాంగ్ రీమిక్స్ సైతం ఉంటుందట. దీనికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలపై తెరకెక్కింది.  సూర్యదేవర నాగవంశీ, త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య ప్రొడ్యూస్ నిర్మాతలు. రామ్ మిరియాల, అచ్చు రాజమణి స్వరకర్తలు.