హిందీ చిత్రసీమకు 'పఠాన్' సినిమా ఊపిరి పోసింది. సరైన విజయం కోసం కొన్నేళ్ళ నుంచి ఎదురు చూస్తున్న బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) కు కూడా! దీపికా పదుకోన్ కథానాయికగా, జాన్ అబ్రహం ప్రతినాయకుడిగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ బరిలో వసూళ్ళ సునామీ సృష్టిస్తోంది.
'ఏక్ థా టైగర్', 'టైగర్ జిందా హై', 'వార్' సినిమాల తర్వాత యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ (YRF Spy Universe)లో వచ్చిన సినిమా 'పఠాన్'. ఇందులో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించారు. 'టైగర్ 3'లో షారుఖ్ ఖాన్ కనిపిస్తారని బీ టౌన్ టాక్. అది పక్కన పెడితే... ఈ స్పై యూనివర్స్ కొత్త సినిమా గురించి క్రేజీ అప్డేట్ వచ్చింది.
'టైగర్' వర్సెస్ 'పఠాన్' అయితే?
Shah Rukh Khan vs Salman Khan : షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ హీరోలుగా యష్ రాజ్ ఫిల్మ్స్ అధినేత, బాలీవుడ్ బడా నిర్మాత ఆదిత్య చోప్రా భారీ సినిమా ప్లాన్ చేస్తున్నారట. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అది బిగ్గెస్ట్ యాక్షన్ ఫిల్మ్ అని హిందీ సినిమా వర్గాలు చెబుతున్నాయి.
Also Read : 'సార్' రివ్యూ : ధనుష్ పాఠాలు బోర్ కొట్టించాయా? ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయా?
'పఠాన్'గా షారుఖ్, 'టైగర్'గా సల్మాన్... రెండు క్యారెక్టర్లను బేస్ చేసుకుని క్రాస్ ఓవర్ సినిమా ప్లాన్ చేస్తున్నారట. అందులోనూ నువ్వా? నేనా? అన్నట్లు రెండు క్యారెక్టర్స్ మధ్య ఫైట్ సీన్స్ ఉన్నాయట. ప్రస్తుతం బేసిక్ స్టోరీలైన్ లాక్ చేశారని, స్క్రిప్ట్ డెవలప్ చేస్తున్నారని సమాచారం.
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో కెప్టెన్ అమెరికా వర్సెస్ ఐరన్ మ్యాన్ థీమ్ నేపథ్యంలో 'సివిల్ వార్' సినిమా వచ్చింది. డీసీ యూనివర్స్‌లో బ్యాట్ మ్యాన్ వర్సెస్ సూపర్ మ్యాన్ సినిమా వచ్చింది. ఆ తరహాలో షారుఖ్, సల్మాన్ సినిమా ప్లాన్ చేశారట.
'పఠాన్' @ 500 కోట్లు!
రూ. 500 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మార్కును 'కేజీఎఫ్ 2' ఏడు రోజుల్లో అందుకుంటే... 'బాహుబలి 2'కి ఎనిమిది రోజులు పట్టింది. షారుఖ్ 'పఠాన్' సినిమా ఐదు రోజుల్లో చేరుకుంది. దర్శక ధీరుడు రాజమౌళి లేటెస్ట్ మాస్టర్ పీస్ RRR మాత్రమే మూడు రోజుల్లో 500 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి ఈ లిస్టులో షారూఖ్ కంటే ముందుంది.
లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... అతి త్వరలో ఈ సినిమా 500 కోట్ల నెట్ వసూళ్ళను చేరుకుంది. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో వసూళ్ళు చూస్తే... గురువారంతో ఈ మార్క్ అందుకుంది.
Also Read : లావణ్యా త్రిపాఠికి 72 గంటలు టైమ్ ఇచ్చిన సుమన్, 'పులి - మేక' ఫస్ట్ గ్లింప్స్ చూశారా?
'ఆర్ఆర్ఆర్' విడుదలైనప్పుడు ఉన్న పరిస్థితులు వేరు... షారూఖ్ ఖాన్ 'పఠాన్' విడుదలైన పరిస్థితులు వేరు. 'పఠాన్' సినిమా విడుదలకు ముందు షారుఖ్ ఖాన్ ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. తన కుమారుడు ఆర్యన్ ఖాన్ (Aryan Khan) ను డ్రగ్స్ కేసులో NCB అధికారులు అరెస్ట్ చేసిన దగ్గర నుంచి షారూఖ్ ఏం చేసినా వివాదమే. 'పఠాన్' టైటిల్ నుంచి షారూఖ్ లుక్, సినిమాలోని 'బేషరమ్ రంగ్' పాటలో దీపికా పదుకోన్ ధరించిన బికినీ రంగు, సోషల్ మీడియాలో బాయ్ కాట్ పఠాన్ ట్రెండ్స్... ఒక్కటి కాదు, బోలెడు ఫేస్ చేశారు. కొన్ని ఏరియాల్లో థియేటర్లలో స్క్రీనింగ్ కానివ్వకుండా కొందరు అడ్డు పడ్డారు. పోస్టర్లను తగులబెట్టారు. ఘర్షణలకు దిగారు. సెన్సార్ విషయంలోనూ కొంత ఇబ్బంది పడ్డారు. విజయాలు లేక షారుఖ్ కూడా బ్రేక్ తీసుకున్నారు. వాటిని మర్చిపోయే విజయం 'పఠాన్' అందించింది.