Tiger 3 Movie First Review Telugu : 'టైగర్ 3' కోసం టాలీవుడ్ ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకు కారణం యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ (YRF Spy Universe)లో లేటెస్ట్ ఫిల్మ్ కావడం ఒకటి అయితే... ఈ స్పై ఫ్రాంచైజీలో నెక్స్ట్ సినిమా 'వార్ 2'లో మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తుండటం మరో కారణం!
'ఏక్ థా టైగర్', 'టైగర్ జిందా హై', 'వార్', 'పఠాన్' సినిమాల తర్వాత యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మించిన స్పై థ్రిల్లర్ 'టైగర్ 3' (Tiger 3 Movie). బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ మరోసారి జంటగా నటించిన చిత్రమిది. దీపావళి కానుకగా ఈ ఆదివారం (నవంబర్ 12న) థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది. అయితే... ఆల్రెడీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.
సాలిడ్ యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్!
'టైగర్ 3' సినిమా సాలిడ్ యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ అని ఆల్వేస్ బాలీవుడ్ అనే ట్విట్టర్ పోర్టల్ పేర్కొంది. సినిమాకు ఫోర్ స్టార్ రేటింగ్ ఇచ్చింది. టైగర్ హీరోయిజం కాస్త కిందకు పడుతూ పైకి లేచినప్పటికీ... నటీనటులు అందరూ అద్భుతంగా, తమ నుంచి తప్పులు ఏమీ లేకుండా నటించారని పేర్కొన్నారు. దాంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమాలో బాలీవుడ్ సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ చేశారు.
Also Read : తెలుగు ప్రేక్షకులకు డబ్బింగ్ దీపావళి - టాలీవుడ్ స్టార్ సినిమా ఒక్కటీ లేదుగా!
ఆదివారం ఉదయం ఏడు గంటలకు...
Tiger 3 Movie First Show November 12 : సాధారణంగా సినిమాలు శుక్రవారం నాడు విడుదల అవుతుంటాయి. కానీ, ఆదివారం 'టైగర్ 3' విడుదల అవుతోంది. ఆదివారం ఉదయం ఏడు గంటలకు ఫస్ట్ షో వేయనున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది. కొన్ని ప్రాంతాల్లో ఆరు గంటలకు షోలు వేయడానికి ప్లాన్ చేస్తున్నారు. విదేశాల్లో ఒక్క రోజు ముందు ప్రీమియర్లు పడతాయి. అందువల్ల, శనివారం రాత్రి 9 గంటలకు ఓవర్సీస్ రివ్యూలు వస్తాయి.
Also Read : 'గేమ్ ఛేంజర్'కు భారీ డీల్ - విడుదలకు ముందు కోట్లు కొల్లగొట్టిన సాంగ్స్!
'టైగర్ 3' చిత్రానికి మనీష్ శర్మ (Manish Sharma) దర్శకుడు. ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత, యశ్ రాజ్ ఫిలిమ్స్ అధినేత ఆదిత్య చోప్రా నిర్మాత. ఈ సినిమా నిర్మించడంతో పాటు ఆయన కథ అందించారు. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే : శ్రీధర్ రాఘవ, ఛాయాగ్రహణం : అనయ్ ఓం గోస్వామి, సంగీతం : ప్రీతమ్.