Koffee With Karan Season 8 Episode 3 - Ananya Panday On Liger Flop : రౌడీ బాయ్, 'ది' విజయ్ దేవరకొండ ఫస్ట్ పాన్ ఇండియా సినిమా 'లైగర్'. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన నటించిన తొలి సినిమా కూడా అదే. విడుదలకు ముందు ఆ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేశారు. 


'లైగర్' మార్నింగ్ షో తర్వాత రిజల్ట్ ఏంటనేది అందరికీ అర్థమైంది. భారీ డిజాస్టర్ అవుతుందని ప్రేక్షకులకు సైతం క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఆ సినిమా ఫ్లాప్ టాక్ టాపిక్ మరోసారి తెరపైకి వచ్చింది. అందుకు కారణం 'కాఫీ విత్ కరణ్' ప్రోగ్రామ్!


'లైగర్' చేయడం తప్పే!? - అనన్యా పాండే
'లైగర్'తో బాలీవుడ్ భామ అనన్యా పాండే (Ananya Pandey) తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఆమెకు ఫస్ట్ అండ్ స్ట్రెయిట్ తెలుగు సినిమా అది. దక్షిణాది భాషల్లో కూడా ఫస్ట్ సినిమా. 'లైగర్' డిజాస్టర్ గురించి 'కాఫీ విత్ కరణ్' లేటెస్ట్ ఎపిసోడ్ (సీజన్ 8)లో డిస్కషన్ వచ్చింది. అప్పుడు ''ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు'' అని అనన్యా పాండే పేర్కొన్నారు. 'లైగర్' చేయడం తన తప్పు అన్నట్లు ఆవిడ మాట్లాడారు. మరో విషయం కూడా ఆవిడ రివీల్ చేశారు. 'లైగర్' సినిమా చేయడానికి కారణం కరణ్ జోహార్, తన తల్లి భావనా పాండే అని అనన్య చెప్పారు. 


అంత చెత్త రివ్యూ ఎప్పుడూ రాలేదు!
తన సినిమా విడుదలైన ప్రతిసారీ తల్లి భావనా పాండే నుంచి ఫోన్ లేదా మెసేజ్ వస్తుందని, అయితే 'లైగర్' విడుదల తర్వాత ఎటువంటి రెస్పాన్స్ రాలేదని అనన్యా పాండే చెప్పారు. 'లైగర్' ఎలా ఉందని అడిగితే... 'ఫన్' అని రిప్లై వచ్చిందట. తనకు ఎప్పుడూ అంత చెత్త రివ్యూ రాలేదని అనన్యా పాండే పేర్కొన్నారు. అదీ సంగతి!


Also Read : తెలుగు ప్రేక్షకులకు డబ్బింగ్ దీపావళి - టాలీవుడ్ స్టార్ సినిమా ఒక్కటీ లేదుగా!


'లైగర్' తర్వాత తెలుగులో మరో సినిమాకు అనన్యా పాండే సంతకం చేయలేదు. ఆ మాటకు వస్తే... సౌత్ సినిమాల నుంచి కూడా ఆమెకు పెద్దగా ఆఫర్లు వెళ్లినట్లు లేవు. 'లైగర్' విడుదలకు ముందు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'జన గణ మణ' చేయడానికి విజయ్ దేవరకొండ రెడీ అయ్యారు. అయితే... 'లైగర్' డిజాస్టర్ కావడంతో ఆ సినిమాను క్యాన్సిల్ చేసుకున్నారు.


Also Read 'గేమ్ ఛేంజర్'కు భారీ డీల్ - విడుదలకు ముందు కోట్లు కొల్లగొట్టిన సాంగ్స్!



'లైగర్' తర్వాత విజయ్ దేవరకొండ 'ఖుషి'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమాను కూడా పాన్ ఇండియా రిలీజ్ చేశారు. అయితే... విడుదల తర్వాత మంచి ప్రశంసలు వచ్చాయి. కానీ, కొన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ కాలేదని టాక్.