వైవిధ్యమైన కథలు, సినిమాలు చేస్తూ జయాపజయాలతో సంబంధం లేకుండా నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేకత, అభిమానుల్ని సంపాదించుకున్నారు యువ హీరో త్రిగుణ్ (అరుణ్ అదిత్). ఆయన పలు తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సినిమాలు చేశారు. ఇప్పుడు 'లైన్ మ్యాన్' సినిమాతో కన్నడ చిత్రసీమలో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు.


తెలుగు, కన్నడ భాషల్లో 'లైన్ మ్యాన్'
LineMan Movie Release Date: వి. రఘు శాస్త్రి దర్శకత్వంలో త్రిగుణ్ హీరోగా పర్పల్ రాక్ ఎంటర్‌టైనర్స్ సంస్థ ప్రొడ్యూస్ చేసిన 'లైన్ మ్యాన్' సినిమాను ఈ నెల 15న కన్నడ, తెలుగు భాషల్లో విడుదల చేయనున్నారు. ఇటీవల ట్రైలర్ విడుదల చేశారు. 


'లైన్ మ్యాన్'లో త్రిగుణ్ టైటిల్ రోల్ చేశారు. ఆయన క్యారెక్టర్ పేరు నటరాజ్. ఈ సినిమా కథ ఖమ్మం జిల్లా సత్తుపల్లి గ్రామంలో జరుగుతుంది. గ్రామీణ ప్రజల్ని, అక్కడి వాతావరణాన్ని చక్కగా ఆవిష్కరిస్తూ కామెడీ ప్రధానంగా రూపొందించిన చిత్రమిదని అర్థం అవుతోంది. ఒక విధంగా ఈ సత్తుపల్లికి మనమే పవర్ స్టార్ అంటూ తన పాత్రకు త్రిగుణ్ ఇచ్చిన ఇంట్రడక్షన్ బావుంది. సత్తుపల్లి పవర్ స్టార్ ఊరందరికీ కరెంట్ లేకుండా ఎందుకు కట్ చేశాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.


Also Read: 'రానా నాయుడు 2' ఎక్స్‌ క్లూజివ్ అప్డేట్... విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి సెట్స్ మీదకు వెళ్ళేది ఎప్పుడంటే?



సత్తుపల్లి గ్రామంలో 99 ఏళ్ల వయసున్న మహిళ దేవుడమ్మను అందరూ ఎంతో గౌరవంగా చూస్తారు. ఆమె వెయ్యికి పైగా కాన్పులు చేసింది. వందో పుట్టినరోజు జరుపుకోవటానికి ఊరి ప్రజలందరూ రెడీ అవుతున్నారు. ఆ సమయంలో కరెంట్ కోత అంటూ నటరాజ్ షాక్ ఇవ్వడంతో నాలుగు రోజులు పవర్ లేకుండా ఉండటానికి గ్రామస్తులందరూ నిర్ణయించుకుంటారు. అందుకు కారణం ఏమిటో సినిమా చూసి తెలుసుకోవాలని దర్శకుడు చెబుతున్నారు.'లైన్ మ్యాన్' ట్రైలర్‌ చూస్తే... వినోదం, ఆహ్లదంతో పాటు తెలియని గందరగోళం కూడా ఉందని తెలుస్తుంది. ఇదొక ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ ఫిల్మ్ అని, ప్రస్తుత సమాజానికి ఓ సందేశం కూడా ఉంటుందని తెలుస్తోంది.


Also Readప్రభాస్ ఒక్కడి కోసమే అలా చేశారంతే - పాన్ ఇండియా ఫిల్మ్స్, 'భీమా' గురించి గోపీచంద్ ఇంటర్వ్యూ



త్రిగుణ్, కాజల్ కుందర్ జంటగా నటించిన 'లైన్ మ్యాన్' సినిమాలో బి. జయశ్రీ, నివిక్షా నాయుడు, హరిణి శ్రీకాంత్, సుజయ్ శాస్త్రి, అపూర్వ శ్రీ, మైకో నాగరాజ్, చేతన్ గంధర్వ, దిలీప్ కుమార్, సందీప్ కెంపెగౌడ, శ్రీ దత్త, సమర్థ్ నర్సింహులు, సుహైల్ రసూల్, గౌరవ్ శెట్టి ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కూర్పు: రఘునాథ ఎల్, కళా దర్శకత్వం: సూర్య గౌడ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: గణేష్ పాపన్న, ఛాయాగ్రహణం: శాంతి సాగర్ హెచ్ జి, సంగీతం: కాద్రి మణికాంత్,సహ నిర్మాతలు: ప్రచూర. పి - కాద్రి మణికాంత్ - జ్యోతి రఘు శాస్త్రి - భళా స్టూడియోస్, నిర్మాణం: పర్పల్ రాక్ ఎంటర్‌టైనర్స్, రచన - దర్శకత్వం: వి. రఘు శాస్త్రి.