Vishwaksen Laila Movie : సినీ ఇండస్ట్రీలో స్టార్స్ సైతం ఛాలెంజింగ్ గా భావించే రోల్స్ లో లేడీ గెటప్ ఒకటి. చాలామంది స్టార్స్ ఇలాంటి రోల్స్ చేసే సాహసం చేయాలన్న ఆలోచనకే నో చెప్తారు. కానీ తాజాగా విశ్వక్ సేన్ 'లైలా' అనే మూవీలో ఇలాంటి రోల్ పోషించి అందరిని సర్ప్రైజ్ చేశారు. తాజాగా ఈ మూవీ సాంగ్ లాంచ్ ఈవెంట్లో నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ ఈ సినిమాను ముగ్గురు హీరోలు రిజెక్ట్ చేశారని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.


'లైలా' మూవీని రిజెక్ట్ చేసిన ముగ్గురు హీరోలు


యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం 'లైలా'. రామ్ నారాయణ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి ఈ మూవీని నిర్మిస్తున్నారు. 'లైలా' సినిమాను ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే కానుకగా రిలీజ్ చేయబోతున్నారు. గురువారం ఈ సినిమాలోని 'ఇచ్చుకుందాం బేబీ' అనే పాటను లాంచ్ చేశారు. లియోన్ జేమ్స్ సంగీతం, ఈ పాటకు పూర్ణాచారి సాహిత్యం అందించారు. ఆదిత్య ఆర్కే, మానసి ఈ పాటను పాడారు.


ఈ సాంగ్ లాంచ్ సందర్భంగా నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ "డైరెక్టర్ రామ్ ఈ మూవీ స్టోరీని చెప్పినప్పుడు ఇద్దరు ముగ్గురు హీరోలను సంప్రదించాను. కానీ ఇందులో లేడీ క్యారెక్టర్ ఉండటంతో చేయగలమా లేమా అనే డైలామాలో పడ్డారు. అలాంటి టైంలో విశ్వక్ సేన్ నేను చేయగలను, ఇలాంటి ఛాలెంజింగ్ రోల్ కోసమే వెయిట్ చేస్తున్నాను అని ముందుకు వచ్చారు. ఇలాంటి క్యారెక్టర్ని అందరూ చేయలేరు. నీ ఫిల్మోగ్రఫిలో ఇదొక మంచి క్యారెక్టర్ గా మిగిలిపోతుంది విశ్వక్ " అంటూ చెప్పుకోచ్చారు. అయితే ఆ ముగ్గురు హీరోలు ఎవరు అన్న విషయాన్ని మాత్రం ఆయన బయట పెట్టలేదు. దీంతో ప్రస్తుతం ఈ మూవీని రిజెక్ట్ చేసిన ఆ ముగ్గురు హీరోలు ఎవరు అనే విషయం హాట్ టాపిక్ గా మారింది.






వాలెంటైన్స్ డే రోజున సింగిల్స్ కి 'లైలా'...


ఇక ఈ సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ "ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా థియేటర్లలోకి వస్తున్నాము. సాధారణంగా వాలెంటైన్స్ డే అనగానే సింగిల్స్ అందరూ మాకు ఎవ్వరూ లేరని ఫీల్ అవుతారు. అలా ఫీలయ్యే వారందరికీ లైలా ఉంది. ఈ వాలెంటెన్స్ డేకి ఎవ్వరూ సింగిల్ కాదు. ఒకవేళ అమ్మాయిలు మేము సింగిల్... మాకు ఎవరు తోడు అంటే... వాళ్లకు సోను మోడల్ వున్నాడు. ఇక మూవీ రిలీజ్ అయ్యే వరకు 'ఇచ్చుకుందాం బేబీ'కి మీరు ఇచ్చుకోండి. నా ఫోటో వాడకండి అంతే... ఎంత బాగున్నా గానీ జస్ట్ చూసి ఆపేయండి. కత్తిలా ఉన్నానని పొగిడి ఆపేయండి. ఇలాంటి క్యారెక్టర్ చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఈ లేడీ గెటప్ కోసం మేకప్ కేర్ రెండు గంటలు పట్టేది. ఓసారి షూటింగ్ లొకేషన్లో లైలా గెటప్ తో మా నాన్నకి వీడియో కాల్ చేస్తే ఆయన అసలు గుర్తుపట్టలేదు" అంటూ విశ్వక్ సేన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.



Read Also : Kichcha Sudeep : కర్ణాటక స్టేట్ ఫిల్మ్ అవార్డును రిజెక్ట్ చేసిన స్టార్ హీరో సుదీప్... కారణం ఏంటో తెలుసా ?