Prabhas's The Raja Saab Release Postponed Rumours Gone Viral : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ మారుతి కాంబో అవెయిటెడ్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ 'ది రాజా సాబ్'. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే, ఇప్పుడు మళ్లీ ఆ తేదీపై కన్ఫ్యూజన్ నెలకొంది. సినిమా రిలీజ్ మళ్లీ వాయిదా పడుతుందంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.
మళ్లీ వాయిదా పడుతుందా?
ఇప్పటికే షెడ్యూల్ కంప్లీట్ కాగా... కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పెండింగ్‌లో ఉన్నందున అనుకున్న టైంకే సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే సాగుతోంది. వీఎఫ్ఎక్స్ పనులు ఆలస్యం కావడం వల్ల మూవీ రిలీజ్ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయంటూ కొందరు పోస్టులు పెట్టగా... మరికొందరు మాత్రం అది నిజం కాదని... సంక్రాంతి సందర్భంగా మూవీ కచ్చితంగా జనవరి 9నే రిలీజ్ అవుతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
'డిసెంబర్ 5కే రావాల్సి ఉన్నా పండుగ సీజన్ కోసం జనవరి 9కి డేట్ మార్చాం. ఇది నిర్మాత చెప్పిన మాట' అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. చెప్పిన టైంకే మూవీ రిలీజ్ చేస్తారని... అనవసర రూమర్స్ స్ప్రెడ్ చెయ్యొద్దని సూచిస్తున్నారు. అయితే, దీనిపై మూవీ టీం క్లారిటీ ఇస్తే బాగుంటుందని డార్లింగ్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అప్పుడే ఇలాంటి రూమర్లకు చెక్ పడుతుందని అంటున్నారు. మరి టీం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే?
ప్రభాస్ 'ది రాజా సాబ్' నుంచి ఫస్ట్ సింగిల్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్‌గా డార్లింగ్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ సింగిల్ వస్తుందనుకున్న ఫ్యాన్స్‌కు నిరాశే మిగిలింది. రీసెంట్‌గానే కేరళతో పాటు యూరప్‌లోనూ సాంగ్స్ షూటింగ్ షెడ్యూల్ మూవీ టీం కంప్లీట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఫస్ట్ పాట ఈ నెల 5న రిలీజ్ కావొచ్చని తెలుస్తోంది. అలాగే, రెండో సింగిల్ డిసెంబర్ 9న రానుండగా... ఈ ఏడాది చివరి వరకూ అన్నీ సాంగ్స్ రిలీజ్ చేసేందుకు టీం ప్లాన్ చేస్తుందట. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, టీజర్, ట్రైలర్ వింటేజ్ ప్రభాస్‌ను గుర్తు చేస్తున్నాయి. ఇప్పటివరకూ ఎవరూ చూడని లుక్‌లో ప్రభాస్‌ను చూడబోతున్నట్లు ట్రైలర్‌ను బట్టే అర్థమవుతోంది.
మూవీలో ప్రభాస్ సరసన మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్, వీటీవీ గణేష్ కీలక పాత్రలు పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్‌తో మూవీని నిర్మిస్తున్నారు. ఎప్పుడెప్పుడు సినిమాను చూస్తామా? డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.