Chiranjeevi's Mana Shankara Varaprasad Garu Movie Shooting Update : మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబో లేటెస్ట్ మాస్ కామెడీ ఎంటర్టైనర్ 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ షూటింగ్ క్లైమాక్స్‌కు వచ్చేసింది. వచ్చే ఏడాది సంక్రాంతికి మూవీ రిలీజ్ కానుండగా అందుకు తగ్గట్లుగా శరవేగంగా షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంటుంది.
క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్
ఈ మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉండగా క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్‌ను మూవీ టీం భారీగా ప్లాన్ చేస్తోంది. ఆదివారం నుంచి హైదరాబాద్‌లో షూటింగ్ స్టార్ట్ చేశారు. ఇందు కోసం బిగ్ సెట్ వేసినట్లు తెలుస్తోంది. ఫేమస్ యాక్షన్ కొరియోగ్రాఫర్ వెంకట్ మాస్టర్ పర్యవేక్షణలో చిరుతో పాటు ఫైటర్స్ బృందంపై సీన్స్ చిత్రీకరిస్తున్నారు. మెగా ఫ్యాన్స్ ఊహకు అందని విధంగా ప్రతీ సీన్ గ్రాండ్‌గా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. చిరు జోష్, గ్రేస్, అనిల్ టచ్ కలిసిన క్లైమాక్స్... ఆడియన్స్‌కు మర్చిపోలేని ఎక్స్‌పీరియన్స్ అందించనుందనే టాక్ వినిపిస్తోంది.
ట్రెండింగ్‌లో 'మీసాల పిల్ల'
ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన మెగాస్టార్ స్టైలిష్ లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. మరోసారి వింటేజ్ మెగాస్టార్‌ను స్క్రీన్‌పై ప్రెజెంట్ చేయనున్నారు డైరెక్టర్ అనిల్. ఇక రీసెంట్‌గా రిలీజ్ చేసిన 'మీసాల పిల్ల' సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. చిరు స్టెప్పులు, నయనతార అందం, డ్యాన్స్ హైలెట్‌గా నిలిచాయి. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ వేరే లెవల్‌లో ఉంది. ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర పోషిస్తుండగా రీసెంట్‌గానే ఆయన మూవీ షూటింగ్‌లో పాల్గొన్నారు.
Also Read : సరికొత్తగా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ - 'కింగ్' మూవీతో మరో వెయ్యి కోట్లు కన్ఫర్మేనా!
చిరు రోల్ ఏంటి?
చిరంజీవి సరసన హీరోయిన్ నయనతార శశిరేఖ పాత్రలో కనిపించనున్నారు. చిరుతో పాటు విక్టరీ వెంకటేష్ రోల్ ఏంటి? అనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గ్లింప్స్‌తో పాటు 'మీసాల పిల్ల' సాంగ్‌లోనూ ఆయన వెనుక భారీ సెక్యూరిటీ ఉండగా ఆయన RAW ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇక డ్రిల్ మాస్టర్‌గానూ కనిపించనున్నారనే మరో రూమర్ కూడా వినిపిస్తోంది. మరి దీనిపై సస్పెన్స్ వీడాలంటే మూవీ రిలీజ్ వరకూ ఆగాల్సిందే. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
చిరు, నయనతార, వెంకటేష్‌లతో పాటు కేథరిన్, వీటీవీ గణేష్, మురళీ ధర్ గౌడ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ సమీర్ రెడ్డి, ఎడిటింగ్ - తమ్మిరాజు, ఆర్ట్ డైరెక్షన్ - ఏ.ఎస్. ప్రకాష్. ఎస్.కృష్ణ, జి.ఆదినారాయణ, సహ రచయితలు - ఎస్.కృష్ణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.