మెగా హీరో వరుణ్ తేజ్, అందాల తార లావణ్య త్రిపాఠి మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. నవంబర్ 1న ఇటలీలో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ పెళ్లి కోసం ఇప్పటికే ఇరు కుటుంబ సభ్యులు ఇటలీకి వెళ్లారు. తాజాగా ఈ వివాహ వేడుకల కోసం కొణిదెల, కామినేని కుటుంబాలు ఇటలీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇటలీలోని పలు పర్యాటక ప్రాంతాల్లో హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు. రామ్‌ చరణ్, ఉపాసన, చిరంజీవి, ఆయన సతీమణితో పాటు ఇతర కుటుంబ సభ్యులు అందమైన ప్రదేశాల్లో విహరిస్తున్నారు. తాజాగా అందరూ కలిసి టుస్కానీలో ఓ గ్రూప్ ఫోటో తీసుకున్నారు. ఈ ఫోటోను ఉపాసన తన ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.  


ఒకే ఫ్రేమ్ లో కొణిదెల, కామినేని కుటుంబాలు


ఇక ఉపాసన షేర్ చేసిన ఫోటోలో రామ్ చరణ్, ఉపాసన ఒకరి పక్కన మరొకరు నిలబడి ఉన్నారు. చిరంజీవి సతీమణి సురేఖ, ఉపాసన తల్లి మధ్యలో కూర్చొని ఉండగా, వారి పక్కన చిరంజీవి, ఉపాసన తండ్రి కూర్చున్నారు. ఇతర కుటుంబ సభ్యులు కొంత మంది ముందు కూర్చొని ఉండగా, మరికొంత మంది వెనుక నిల్చున్నారు. అందమైన నీటి సరస్సు ముందు వారు ఈ ఫోటో తీసుకున్నారు. ఇందులో చెర్రీ దంపతుల ముద్దులు కూతురు క్లీంకార కూడా కనిపిస్తోంది. అయితే, ఆమె ముఖాన్ని కనిపించకుండా లవ్ ఎమోజీ అడ్డు పెట్టారు. దీంతో ఫ్యాన్స్ చాలా నిరాశకు గురవుతున్నారు. క్లోజప్ పిక్ కాదు కదా.. ఫేస్ చూపించవచ్చు కదా అని అంటున్నారు. అయితే, నీటిలో మాత్రం చిన్నారి ప్రతిబింబం చక్కగా కనిపిస్తోంది. దీంతో దాన్ని జూమ్ చేసి ‘డి-కోడ్’ చేసే పనిలో ఫ్యాన్స్ ఉన్నారు.


ఫోటోను షేర్ చేస్తూ ఉపాసన.. ‘టస్కానీలో కొణిదెల, కామినేని హాలీడే! అని క్యాప్షన్ ఇచ్చారు. ఇక ఈ ఫోటోను చూసి మెగా అభిమానులు తెగ సంతోష పడుతున్నారు. ఫోటోలో క్లీంకార ముఖాన్ని దాచిపెట్టినప్పటికీ, నీటిలో ఆమె ప్రతిబింబం చక్కగా కనిపిస్తోందని అభిమానులు కామెంటస్ పెడుతున్నారు. “ఉప్సీ అక్కా.. మీరు నీటిలో ప్రతిబింబించే క్లీంకార ముఖంపై హార్ట్ ఎమోజీ ఉంచడం మర్చిపోయారు..” మరో నెటిజన్ రాసుకొచ్చాడు. “పాలల్లో చందమామ ని చూసినట్టు, నీళ్ళల్లో క్లింకారని చూసాం” అని ఇంకో అభిమాని రాశారు.  






ఇటలీలో పెళ్లి, హైదరాబాద్ లో రిసెప్షన్


వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహ వేడుక కోసం నటులు రామ్ చరణ్, అల్లు అర్జున్, సహా కజిన్స్ అందరూ ఇటలీకి బయల్దేదేరి వెళ్లారు. ఆదివారం నాడు అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ఇటలీకి బయలుదేరారు. నవంబర్‌ 1న వరుణ్ తేజ్, లావణ్య వివాహం జరగనుంది. ఇవాళ కాక్‌టేల్‌ పార్టీతో పెళ్లి వేడుకలు మొదలుకానున్నాయి. 31న హల్దీ, మెహందీ నిర్వహించనున్నారు.  సినీ ఇండస్ట్రీ, ప్రముఖుల కోసం నవంబర్‌ 5న హైదరాబాద్‌లో రిసెప్షన్‌ నిర్వహించనున్నారు. మాదాపూర్‌ ఎన్‌ కన్వెన్షన్‌ లో ఈ వేడుక జరగనుంది.


Read Also: 'కన్నప్ప' షూటింగ్‌లో ప్రమాదం, మంచు విష్ణుకు గాయాలు!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial