బుల్లితెర యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్, ప్రస్తుతం వెండితెరపై సత్తా చాటుతోంది. వరుస సినిమాలో ఫుల్ బిజీగా గడుపుతోంది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఆమె చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. “మహానటి సావిత్రిలా నటించడం ఎంత కష్టమో, ఎక్స్‌పోజింగ్ చేయడం కూడా అంతే కష్టం” అంటూ రాసుకొచ్చింది. ఇంతకీ ఆమె ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే?  


అనసూయకు నెటిజన్ కౌంటర్


తాజాగా అనసూయ ఓ తెలుగు ఛానెల్ నిర్వహించిన అవార్డుల వేడుకలో పాల్గొన్నది. ఇందులో ఓ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అలనాటి తారలు సావిత్రి, జమున, శ్రీదేవి, సౌందర్య నటించిన కొన్ని పాటలను ఆమె రీ క్రియేట్‌ చేసింది. వారి మాదిరిగానే గెటప్స్ వేసుకుని అద్భుతంగా డ్యాన్స్ చేసింది. ఈ ఈవెంట్ కు సంబంధించి కొన్ని ఫోటోలను అనసూయ ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకుంది. “నా డ్యాన్స్ పెర్ఫామెన్స్‌ తో దిగ్గజ తారలకు నివాళి అర్పించే ఛాన్స్ రావడం అదృష్టంగా భావిస్తున్నాను” అని వెల్లడించారు. చాలా మంది ఆమె పోస్టుకు పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్నారని వెల్లడించారు. అయితే, ఓ నెటిజన్ మాత్రం ఆమెకు కౌంటర్ ఇచ్చాడు. ‘ఎక్స్‌ పోజింగ్ చేసినంత ఈజీ కాదు.. సావిత్రిలా నటించడం అంటే” అంటూ ట్వీట్ చేశారు.  






దిమ్మ తిరిగే సమాధానం చెప్పిన అనసూయ


ఈ ట్వీట్ కు అనసూయ రియాక్ట్ అయ్యింది. సదరు నెటిజన్ కు గట్టి సమాధానం చెప్పింది. “నిజం చెప్పారండీ.. సావిత్రమ్మలా నటించడం చేయటం ఎవరి తరం కాదు. నేను కేవలం వారికి నివాళిగా ప్రదర్శన ఇచ్చాను. అంతేకాదు, ఎక్స్‌ పోజింగ్ చేయడం అనేది కూడా ఈజీ కాదు. ఫిజికల్ గా, ఎమోషనల్ గా చాలా ప్రిపేర్ కావాలి. ఏ పాత్ర చేసినా, ఏ దుస్తులు ధరించినా మన పనిని దృఢ సంకల్పంతో చెయ్యాలి” అని వెల్లడించింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.  






వరుస సినిమాలతో అలరిస్తున్న అనసూయ


అనసూయ రీసెంట్ గా నటించి పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ‘విమానం’, ‘పెదకాపు 1’, ‘ప్రేమ విమానం’ సినిమాల్లో తన అద్భుత నటనతో అందరినీ ఆకట్టుకుంది. ‘విమానం’ సినిమాలో వేశ్య పాత్రలో అద్భుతంగా ఆకట్టుకుంది. ‘ప్రేమ విమానం’ సినిమాలో భర్తను కోల్పోయిన మహిళగా, ఇద్దరు పిల్లల తల్లిగా చక్కగా నటించింది. ఇక ఇప్పటికే ఆమె నటించిన ‘పుష్ప’ సినిమా చక్కటి గుర్తింపు తెచ్చింది. ఇందులో దాక్షాయణిగా అలరించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ‘పుష్ప 2’లో నటిస్తోంది. ఈ సినిమాతో పాటు మరికొన్ని చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషిస్తోంది. అడపాదడపా బుల్లితెర ఈవెంట్లోనూ పాల్గొంటూ అభిమానులను అలరిస్తోంది.


Read Also: ల‌వ్ ఫెయిల్యూర్​తో మంచే జరిగింది, బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial