Kalki  Kondapalli Toys: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ రేంజిలో బజ్ క్రియేట్ చేసుకున్న సినిమా ‘కల్కి 2898 ఏడీ‘. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా, యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమా కొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ మూవీపై భారీగా అంచనాలు పెంచేసింది. తాజాగా చిత్ర బృందం ముంబైలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, ప్రభాస్, నాగ్ అశ్విన్ సహా పలువురు దిగ్గజాలు ఈ వేడుకలో పాల్గొన్నారు.


కొండపల్లి బొమ్మలను తాకిన ‘కల్కి‘ మూవీ క్రేజ్


తెలుగు ప్రేక్షకులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండియన్ సినీ అభిమానులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా? అని ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో ‘కల్కి’ క్రేజ్ రోజు రోజుకు పెరిగిపోతోంది. తాజాగా ఈ మూవీ క్రేజ్ ప్రపంచ ప్రఖ్యాత కొండపల్లి బొమ్మలను తాకింది. ‘కల్కి’ సినిమాలో ప్రభాస్ ను పోలిన బొమ్మలను రూపొందిస్తున్నారు కొండపల్లి బొమ్మల తయారీదారులు. తాజాగా ‘కల్కి’ కొండపల్లి బొమ్మలు తయారు చేస్తున్న వీడియోను వైజయంతి మూవీస్ సంస్థ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.  


ఆకట్టుకుంటున్న ‘కల్కి’ కొండపల్లి బొమ్మలు  


‘కల్కి 2898 ఏడీ‘ సినిమాకు సంబంధించి ప్రభాస్ ఫోటో మాత్రమే కాదు, అమితాబ్ బచ్చన్ బొమ్మను కూడా రూపొందించారు. ఈ సినిమా స్పెషల్ అట్రాక్షన్ గా నిలువబోతున్న కారు ‘బుజ్జి’ని కూడా తయారు చేశారు. వీటిని తయారు చేయడంతో పాటు స్టోర్ లో అమ్మకానికి కూడా పెట్టినట్లు, వాటిని చిన్న పిల్లలు ఇష్టపడి తీసుకున్నట్లు ఈ వీడియోలో చూపించారు. మొత్తంగా ‘కల్కి 2898 ఏడీ‘ సినిమా క్రేజ్ కొండపల్లి బొమ్మలను కూడా తాకిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కొత్తగా ఆలోచించడంలో ముందుంటున్న కొండపల్లి బొమ్మల తయారీదారులను అభినందిస్తున్నారు. సంప్రదాయానికి ఆధునికతను జోడిస్తున్నందునే కొండపల్లి బొమ్మలు మరింత బాగా పాపులర్ అవుతున్నాయని చెప్తున్నారు.






జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా ‘కల్కి 2898 ఏడీ‘ విడుదల   


‘కల్కి 2898 ఏడీ‘ సినిమా హాలీవుడ్ సినిమాకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటుందని సినీ ప్రేక్షకులు భావిస్తున్నారు. ఈ చిత్రంలోని విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకెళ్లడం ఖాయం అంటున్నారు. జూన్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇక ప్రతిష్టాత్మక చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై దిగ్గజ నిర్మాత అశ్వినీదత్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఏమాత్రం ఖర్చుకు వెనుకడకుండా ఈ సినిమాను తెరకెక్కించారు.



Read Also: కల్కి మూడు ప్రపంచాల మధ్య నడిచే కథ - ఇందులో కాశీ నగరం ప్రత్యేకం, ఎందుకంటే..