Epic Journey of Kalki Episode 2 Telugu: 'కల్కి 2898 AD' రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్ది మూవీ నుంచి సరికొత్త అప్‌డేట్ ఇస్తుంది మూవీ టీం. సరికొత్తగా సినిమాను ప్రమోట్ చేస్తూ క్యూరియాసిటి పెంచుతున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ప్రీల్యూడ్ పేరుతో కల్కిని డిఫరెంట్ ప్రమోట్ చేస్తున్నారు. ముందేన్నడు లేని విధంగా కల్కిలోని కీ రోల్స్ భైరవ,బుజ్జి పాత్రలను యానియేషన్ వెర్షన్ తీసుకువచ్చారు. రీసెంట్‌గా కల్కి ట్రైలర్ రిలీజ్ చేసి మరింత ఆసక్తి పెంచారు. రెండు రోజుల క్రితం బిగ్గెస్ట్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అంటూ భైరవ అంథమ్ సాంగ్ విడుదల చేశారు. ఈ పాటకు యూట్యూబ్‌ని షేక్ చేసింది.
విడుదలైన కొన్ని గంట్లోనే మిలియన్ల వ్యూస్‌తో యూట్యూబ్ ట్రెండింగ్‌లో నిలిచింది. నిన్ని ముంబైలో ప్రీరిలీజ్ ఈవెంట్‌ని గ్రాండ్ నిర్వహించారు. ఇదిలా ఉంటే ఇక నాగ్ అశ్విన్ సైలెంట్ కల్కి మూవీ కథ గురించి చెబుతూ క్యూరియాసిటీ పెంచుతున్నాడు. ప్రీల్యూడ్ పేరుతో ఎపిక్ జర్నీ ఆఫ్ కల్కి 2898 AD అంటూ ఎపిసోడ్ 1 పేరుతో వీడియో విడుదల చేశారు. ఇందులో నాగ్ అశ్విన్ కల్కి కథ ఎలా పుట్టిందో చెబుతూ ఆసక్తి పంచాడు. ఇక తాజాగా ఎపిసోడ్ 2 అంటూ ప్రీల్యూడ్ వీడియో వదిలారు. ఇందులో ఫ్యూచర్ వరల్డ్ ఎలా ఉంటుందంటూ వివరించారు. ఇందులో నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. "కాశీ.. భూమి మీద మొదటి నగరం. అలాంటిది ఈ ప్రపంచంలో కాశీనే ఆఖరి సిటీ అయితే ఎలా ఉంటుందనే ఐడియాతో కల్కి స్క్రిప్ట్‌ని రాసుకోచ్చాం. కలియుగంతో ప్రపంచం అంతం అయిపోతుంది.
అప్పుడు గంగ కూడా ఎండిపోయిన తర్వాత లాస్ట్ సిటీ ఏముటుందని అనుకుంటే, అలాంటి సమయంలో మన కాశీ ఉంటే ఎలా ఉంటుంది.. నాగరికత పుట్టిందే కాశీలో. అలాంటి ఆ సిటీని క్రియేట్ చేయడం చాలా ఇంట్రస్ట్రింగ్‌గా అనిపించింది. ఇండియన్ ఆర్కిటెక్చర్, వెహికిల్స్, కరెన్సీ ఇలా అన్ని ఫ్యూచరిస్టిక్ గా కాశీని బిల్డ్ చేయడం మొదలుపెట్టాం. కాశీని బిల్డ్ చేయడం వెరీ లాంగ్ ప్రాసెస్" అన్నాడు.ఆ తర్వాత "కాశీపైన పిరమిడ్ ఆకారంలో ఉండే స్ట్రక్చర్ ఉంటుంది. దాన్ని మేము కాంప్లెక్స్ అంటాం. భూమిపై లేని నేచర్, యానిమల్స్, ఫుడ్, ఇలా ప్రతిదీ ఇక్కడ ఉంటుంది. ఒకరమైన స్వర్గం అనుకోవచ్చు. కల్కి కథలో మూడో వరల్డ్ కూడా ఉంది. అదే శంబాల. కల్కి స్టొరీకి ఇంటిగ్రల్‌గా ఉంటుంది. కాశీకి కాంప్లెక్స్‌కి సంబంధం లేని థర్డ్ వరల్డ్.
ఈ ప్రపంచంలో ఉన్న వారు కాంప్లెక్స్‌లో ఉన్న వారిని ఛాలెంజ్ చేస్తుంటారు. ఈ వరల్డ్‌లో గాడ్ అనే ఐడియా ఉండదు. దేవుడిని బ్యాన్ చేసిన ప్రపంచం.. ఇలా ఈ మూడు ప్రపంచాల మధ్య మన కథ నడుస్తుంది. ఒకొక్క వరల్డ్‌ని ఒకొక్క థాట్ ప్రాసెస్‌తో డిజైన్ చేశాం. కాశీలో ప్రజలు, వెహికిల్స్, కరెన్సీ, ఫుడ్, వెపన్స్ ఒకలా ఉంటాయి. కాంప్లెక్స్‌లో ఒకలా ఉంటాయి. శంబాలా కంప్లీట్ డిఫరెంట్. ఒకొక్కరు ఒక్కో కల్చర్. శంబాలాలో దేవుడు మళ్ళీ పుడతాడనే ఒక నమ్మకంతో ప్రజలు ఉంటారు. కల్కి అవతారం శంబాలాలో పడుతుందనే నమ్మకం మన పాపులర్ కల్చర్‌లో ఉంది. ఇలా ఈ మూడు ప్రపంచాల మధ్య సాగే కథే కల్కి" అంటూ నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చాడు.
Also Read: మా లాంటి వారికి ఆఫర్ ఇవ్వాలంటే ఆలోచిస్తారు - నా కెరీర్‌కు నా కుటుంబమే అడ్డుపడుతుంది..