Arjun Sarja Dowry to Daughter Aishwarya Marriage: యాక్షిన్‌ కింగ్‌ అర్జున్‌ సర్జా పెద్ద కూతురు, హీరోయిన్‌ ఐశ్వర్య వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. లెజెండరీ నటుడు తంబిరామయ్య కుమారుడు ఉమాపతి రామయ్యతో జూన్‌ 10న ఐశ్వర్య ఏడడుగులు వేసింది. చెన్నైలోని గెరుగంబాక్కంలో అర్జున్‌ స్వయంగా కట్టించిన ఆంజనేయ స్వామి టెంపుల్‌ల జూన్‌ 10న కూతురి పెళ్లిని ఘనంగా జరిపించాడు. ఈ పెళ్లికి ఇరుకుటుంబ సభ్యులు, కొద్దిమంది బంధుమిత్రులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.


ఆ తర్వాత ఇండస్ట్రీ వాళ్ల కోసం చెన్నైలో ప్రత్యేకంగా రిసెప్షన్‌ నిర్వహించాడు అర్జున్‌. అయితే అర్జున్‌ కూతురు పెళ్లిక ఇచ్చిన కట్నం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. నాలుగు దశాబ్దాలుగా అర్జున్‌ ఇండస్ట్రీలో నటుడిగా రాణిస్తున్నాడు. సహానటుడిగా, హీరోగా ఎన్నో సినిమాలు చేశారు. అలా యాక్టర్‌గా ఆయన బాగా సంపాదించాడు. దీంతో కూతురికి కట్నంగా భారీగానే కట్నకానుకలు ఇచ్చాడట. కన్నడ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఇది చర్చనీయాంశం అయ్యింది. కన్నడ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. అర్జున్‌ తన కూతురు ఐశ్వర్యకు కట్న, కానుకల రూపంలో దాదాపు రూ.500 కోట్ల వరకు ఇచ్చినట్టు ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో టాక్‌.


కోట్లు విలువ చేసే విలాసవంతమైన బంగ్లాతో పాటు తన సొంత గ్రామంలోని ప్రాపర్టీస్‌ని ఐశ్వర్య పేరుపై రాశారట. అంతేకాదు కానుకగా కోట్లు విలువ చేసే బంగారు, డైమండ్‌ ఆభరణాలు ఇచ్చాడట. ఇక తనకు ఉన్న మొత్తం ఆస్తిలో ఐశ్వర్యకు సగం ఇచ్చేయనున్నట్టు సమాచారం. అయితే దీనిపై అర్జున్‌ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా ఐశ్వర్య, ఉమాపతి రామయ్యలతి ప్రేమ వివాహం అనే విషయం తెలిసిందే.  కొంతకాలంగా ప్రేమించుకుంటున్న ఐశ్వర్య,ఉమాపతిలు పెద్దలను ఒప్పించి వారి అంగీకారంతో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.ఇదే విషయాన్ని ఇటీవల అర్జున్‌ కూడా స్పష్టం చేశాడు. పెళ్లి అనంతరం కూతురు, అల్లుడుతో అర్జున్‌ మీడియాలో సమావేశం నిర్వహించాడు.






ఈ సందర్భంగా ఐశ్వర్య పెళ్లి ఎలా జరిగింతో చెప్పాడు. ఈ మేరకు అర్జున్‌ మాట్లాడుతూ.. తంబిరామయ్యది మంచి సంప్రదాయ కుటుంబమని, ఆ మధ్య ఓ టీవీ షోకి హోస్టింగ్ చేసిన తాను మొదటి ఉమాపతిని ఆ షోలో చూశానన్నాడు. ఆ షోలో అందులో ఉమాపతి రామయ్య ఓ కంటెస్టెంట్‌గా పోటీ చేశాడని, అప్పుడే తన నాకు నచ్చేశాడన్నారు. అయితే, ఓ రోజు తన కూతురు ఐశ్వర్య నాతో విడిగా మాట్లాడాలని అడిగిందని, అప్పుడే అది ప్రేమ వ్యవహారం అని ఊహించానన్నాడు. ఉమాపతి రామయ్య పేరు చెప్పడంతో తాను షాకయ్యానని, ఆ తర్వాత ఉమాపతి రామయ్య ఫ్యామిలీతో తాను కట్టించిన ఆంజనేయ స్వామి ఆలయంలో మాట్లాడి పెళ్లికి ముహుర్తం పెట్టుకున్నామన్నాడు. అలా తన కూతురు ఐశ్వర్య, ఉమాపతిల పెళ్లి జరిగిపోయిందంటూ అర్జున్‌ చెప్పుకొచ్చాడు.


Also Read: చిరంజీవి, అల్లు అరవింద్ ఎలా కలుసుకున్నారు? - ఇది కుటుంబాల మధ్య మనస్పర్థలా? ఫ్యాన్ వారా?