The Greatest of All Time: సంక్రాంతికి థియేటర్లలో సినిమా సందడి మాత్రమే కాదు.. ఇతర సినిమాల నుంచి అప్డేట్స్‌తో కూడా మూవీ లవర్స్‌కు డబుల్ ఫీస్ట్ లభిస్తుంది. ఇక గతేడాది ‘వారిసు’ సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు తమిళ స్టార్ హీరో విజయ్. ఈ ఏడాది మాత్రం తన నుంచి సినిమాలు ఏమీ లేవు. దీంతో ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు. ఇంతలోనే తన అప్‌కమింగ్ మూవీ గురించి అప్డేట్ ఇస్తూ ఫ్యాన్స్‌ను సంతోషపెట్టాడు విజయ్. ఇప్పటికే విజయ్ అప్‌కమింగ్ మూవీ టైటిల్ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ అని మేకర్స్ ప్రకటించారు. ఇక ఆ మూవీలో కీలక పాత్రలో పోషించే నటులతో తాజాగా ఒక పోస్టర్ విడుదలయ్యింది.
పోస్టర్స్‌తో రివీల్..
వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న చిత్రమే ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (GOAT). ఈ మూవీలో విజయ్ డబుల్ యాక్షన్ చేయనున్నాడు. ఇప్పటికే విడుదలయిన ఈ సినిమా పోస్టర్లు చూస్తే దీనిపై క్లారిటీ వస్తుంది. విజయ్ కెరీర్‌లో ఇది 68వ చిత్రంగా తెరకెక్కుతోంది. ఏజీఎస్ ఎంటర్‌టైన్మెంట్ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ చిత్రాన్ని నిర్మిస్తోంది. కమర్షియల్ కథలకు అప్పుడప్పుడు సైన్స్ ఫిక్షన్‌ను కూడా జోడిస్తూ.. సినిమాలను హిట్ చేయడంలో వెంకట్ ప్రభు ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. కానీ ఇప్పటివరకు విడుదలయిన ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ పోస్టర్స్ చూస్తుంటే ఇది ఒక ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథ అని అర్థమవుతోంది. కానీ అందులో కూడా ఏదో ఒక ట్విస్ట్ ఉండే ఉంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.
అందరూ ఆర్మీ డ్రెస్సుల్లో..
ఇప్పటివరకు ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ మూవీ నుంచి రెండు పోస్టర్లు విడుదలయ్యాయి. ఆ రెండిటిలో విజయ్‌ది డబుల్ రోల్ అని మాత్రమే మేకర్స్ రివీల్ చేశారు. అంతకు మించి ఈ పోస్టర్స్ నుంచి ఇంకా ఎటువంటి సమాచారం రాలేదు. కానీ తాజాగా విడుదల చేసిన సంక్రాంతి స్పెషల్ పోస్టర్‌లో మాత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’లో కీలక పాత్రలు పోషిస్తున్న నటీనటులు అందరూ ఉన్నారు. ఈ పోస్టర్‌లో విజయ్‌తో పాటు అజ్మల్ అమీర్, ప్రశాంత్, ప్రభుదేవా కూడా ఉన్నారు. వారందరూ కూడా విజయ్‌లాగానే ఆర్మీ యూనిఫార్మ్స్‌లో కనిపిస్తున్నారు.
ఇద్దరు హీరోయిన్లు..
‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’లో విజయ్‌కు జోడీగా కన్నడ భామ శ్రీనిధితో పాటు మీనాక్షి చౌదరీ కూడా నటిస్తుందని సమాచారం. వారితో పాటు ఎస్‌జే సూర్య, లైలా, వైభవ్, మోహన్, జయరామ్ లాంటి నటీనటులు కూడా ఇందులో కీలక పాత్రలో పోషిస్తున్నారు. యువన్ శంకర్ రాజా ఈ మూవీకి మ్యూజిక్‌ను అందిస్తున్నారు. సిద్ధార్థ్ నూని సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. వెంటక్ రాజేన్ ఎడిటింగ్ బాధ్యతలు స్వీకరించారు. కల్పతి ఎస్ అఘోరామ్ అలియాస్ ఏజిఎస్.. ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’కు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఏజీఎస్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై 25వ చిత్రంగా ఇది తెరకెక్కుతోంది. ఇప్పటివరకు విడుదలయిన ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లోని పోస్టర్స్ చూస్తుంటే ఈ మూవీకి భారీ బడ్జెట్‌నే ఖర్చు పెడుతున్నట్టు తెలుస్తోంది.
Also Read: ఆ డైరెక్టర్ నన్ను దారుణంగా అవమానించాడు - ఆఫీసు బాయ్‌లా ట్రీట్ చేశాడు