అందాల తారలు భూమి పెడ్నేకర్, షెహనాజ్ గిల్, కుషా కపిల సహా పలువురు ప్రధాన పాత్రలు పోషిస్తున్న తాజా చిత్రం ‘థ్యాంక్యూ ఫర్ కమింగ్’. ఫిల్మ్ మేకర్ రియా కపూర్ భర్త కరణ్ బూలానీ ఈ చిత్రంతో బాలీవుడ్‌ లోకి దర్శకుడిగా అడుగు పెట్టబోతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు విడుదల అయ్యాయి. వీటిలో ముద్దుగుమ్మలు రచ్చ చేస్తూ కనిపించారు. మరో పోస్టర్ లో ఏకంగా టాప్ తీసేస్తున్నట్లు ఉన్న పోజు అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈ పోస్టర్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.


TIFF 2023లో ‘థ్యాంక్యూ ఫర్ కమింగ్’ ప్రదర్శన


‘థ్యాంక్యూ ఫర్ కమింగ్’ చిత్రం టోరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023లో ప్రదర్శించే అవకాశం లభించింది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అవకాశం కల్పించిన TIFF 2023కి ధన్యవాదాలు చెప్పింది.  ఈ సందర్భంగా భూమి పెడ్నేకర్ తన ఇన్ స్టాలో కొత్త పోస్టర్లను షేర్ చేసింది. TIFF 2023లో ఈ సినిమా ప్రదర్శనకు అవకాశం లభించడం సంతోషంగా ఉందని వెల్లడించారు. "ఇది టోరంటోలో ఉన్న అమ్మాయిలందరి కోసం! మా చిక్ ఫ్లిక్ #ThankYouForComing ప్రతిష్టాత్మకమైన టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023కి వెళుతోంది. అధికారికంగా ఎంపిక అయ్యింది” అని చెప్పుకొచ్చింది. ఈ చిత్రం TIFF 2023కి ఎంపిక కావడం గర్వంగా ఉందని షెహనాజ్ గిల్ తెలిపింది. "టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023కు సంబంధించి మా చిత్రం #ThankYouForComingని అధికారికంగా ఎంపిక కావడం గర్వంగా ఉంది.   ప్రీమియర్‌లో కలుద్దాం! #ThankYouForComingAtTIFF." అని రాసుకొచ్చింది. సోనమ్ కపూర్ కూడా పోస్టర్లను షేర్ చేసి ఇదే క్యాప్షన్ రాసింది.






‘థ్యాంక్యూ ఫర్ కమింగ్‌’ గురించి


‘థ్యాంక్యూ ఫర్ కమింగ్‌’ చిత్రాన్ని బాలాజీ మోషన్ పిక్చర్స్ పతాకంపై ఏక్తా కపూర్,  శోభా కపూర్‌లతో కలిసి రియా కపూర్ నిర్మించారు. ఇది అక్టోబర్ 6న విడుదల కానుంది. "ఈ చిత్రంలో కరణ్ కుంద్రా అతిథి పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఆయనకు సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది.  ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి.  


Read Also: కూర్చోని మాట్లాడుకోండి, వైజాగ్‌ డిస్ట్రిబ్యూటర్ కోర్టు సూచన-‘భోళా శంకర్‘కు గ్రీన్ సిగ్నల్


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial