తమిళ స్టార్ హీరో విజ‌య్‌కు తెలుగులో కూడా ఫాలోయింగ్ ఉంది. అతడి స్టయిల్, మేనరిజమ్స్‌కు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే, రష్మికా మందన్నాకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ఆమె స్టయిల్, ఎక్స్‌ప్రెష‌న్స్‌కు నేషనల్ వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఓ సినిమాలో జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా ప్రారంభోత్సవంలో విజ‌య్‌కు రష్మిక దిష్టి తీస్తున్న ఫొటో ఒకటి వైరల్ అయ్యింది. వీడియోలో వాళ్ళిద్దర్నీ చూశారా? ఈ రోజు విడుదల చేశారు. చూసేయండి.






విజయ్ కథానాయకుడిగా రూపొందుతున్న 66వ చిత్రమిది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై 'దిల్' రాజు, శిరీష్... పీవీపీ పతాకంపై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. బుధవారం పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభం అయ్యింది. అనంతరం రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశారు.


జాతీయ పురస్కారం అందుకున్న 'మహర్షి' తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. అన్ని వర్గాలు, భాషల ప్రేక్షకుల్ని అలరించేలా కథను ఆయన రెడీ చేశారని యూనిట్ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్  సంగీతం అందిస్తున్నారు.


Also Read: పవన్ కల్యాణ్ 'హరి హర వీరమల్లు' లేటెస్ట్ అప్‌డేట్‌


వంశీ పైడిపల్లితో పాటు హరి, అహిషోర్‌ సాల్మన్‌ కథ - స్క్రీన్ ప్లే సమకూరుస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ పళని ఛాయాగ్రాహకుడు. ఎడిటర్: కెఎల్ ప్రవీణ్, సహ నిర్మాతలు: హర్షిత్ రెడ్డి & హన్షిత, ప్రొడక్షన్ డిజైనర్స్: సునీల్ బాబు, వైష్ణవి రెడ్డి. 


Also Read: ఎన్టీఆర్‌ను డామినేట్ చేశాడా? రామ్ చరణ్ ఆన్సర్ ఏంటి?