పవన్ కల్యాణ్ కథానాయకుడిగా క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) తెరకెక్కిస్తున్న చారిత్రాత్మక చిత్రం 'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu Movie). ఏప్రిల్ 8... అనగా ఈ శుక్రవారం నుంచి సినిమా లేటెస్ట్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఇందులో పవన్ కల్యాణ్, ఇతర తారాగణం పాల్గొనగా... యాక్షన్ సీక్వెన్సులు తెరకెక్కించడానికి ప్లాన్ చేశారు. హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ తోదోర్ లాజరోవ్ నేతృత్వంలో యాక్షన్ సీన్లు చిత్రీకరించనున్నారు. ఆల్రెడీ వాటి కోసం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వర్క్ షాప్స్ / ప్రాక్టీస్ సెషన్స్ అటెండ్ అయ్యారు.






మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల శ‌కం నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా చిత్రీకరణకు అంతరాయం ఏర్పడింది. రేపటి నుంచి ప్రారంభమయ్యే షెడ్యూల్ లో ఫైట్స్ తీసి... ఆ తర్వాత వీలైనంత త్వరగా సినిమా పూర్తి చేయాలని అనుకుంటున్నారు. ఈ ఏడాది విజయ దశమికి సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. అయితే... యూనిట్ నుంచి అధికారిక ప్రకటన ఏదీ లేదు.






'హరి హర వీరమల్లు'లో పవన్ కల్యాణ్ సరసన నిధీ అగర్వాల్ (Nidhi Agarwal) కథానాయికగా నటిస్తున్నారు. బాలీవుడ్ భామ నర్గిస్ ఫక్రి (Nargis Fakhri Role In Telugu Movie) కీలక పాత్రలో కనిపించనున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam - Hari Hara Veeramallu) సమర్పణలో దయాకర్ రావు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. జ్ఞానశేఖర్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో సినిమా విడుదల కానుంది. 


Also Read: ఎన్టీఆర్‌ను డామినేట్ చేశాడా? రామ్ చరణ్ ఆన్సర్ ఏంటి?


Also Read: ప్రేమించడానికి రీజన్, ఎందుకు ప్రేమించామా అంటే ఆన్సర్ ఉండకూడదు - '18 పేజెస్' గ్లింప్స్‌ చూశారా?