Siddu Jonnalagadda's Telusu Kada movie Twitter Reviews and Premiere Show Report: ఇండియా కంటే ముందుగా అమెరికాలో ప్రీమియర్స్ పడటం కామన్. ప్రతి సినిమాకూ సాధారణంగా జరిగేదే అది. బట్ ఫర్ ఏ ఛేంజ్... ఇటీవల ఇండియాలో పెయిడ్ ప్రీమియర్స్ పడుతున్నాయి. కొన్ని సినిమా ప్రీమియర్లు అమెరికాలో కంటే ముందు ఇండియాలో పడుతున్నాయి. ఆ జాబితాలో 'తెలుసు కదా' చేరుతోంది. ఈ మూవీ ఫస్ట్ షో ఎన్ని గంటలకు? ట్విట్టర్ రివ్యూస్ ఎన్నింటికి వస్తాయి? అనేది చూస్తే...
ఇండియాలో గురువారం రాత్రి...
టీం & సెలబ్రిటీల కోసం స్పెషల్ షో!
Telusu Kada First Show In India: హైదరాబాద్ సిటీలోని ఏఎంబీ మల్టీప్లెక్స్‌లో సిద్ధూ జొన్నలగడ్డ 'తెలుసు కదా' ఫస్ట్ షో పడుతోంది. చిత్ర బృందంతో పాటు సెలబ్రిటీలకు ప్రత్యేకంగా సినిమాను చూపిస్తున్నారు.
ఇండియాలో 'తెలుసు కదా' ఫస్ట్ షో ఏడున్నర (7.30) గంటలకు పడుతోంది. అమెరికా ఫస్ట్ షో విషయానికి వస్తే... ఇండియన్ టైమింగ్ ప్రకారం అక్టోబర్ 17వ తేదీ ఎర్లీ మార్నింగ్ మూడున్నర (3.30) గంటలకు పడుతోంది.
ట్విట్టర్ రివ్యూస్ వచ్చేది ఎప్పుడు?
ప్రీమియర్స్ రిపోర్ట్ ఎన్ని గంటలకు??
Telusu Kada Runtime: 'తెలుసు కదా' రన్ టైమ్ 2.16 గంటలు. ఇంటర్వెల్ ఒక 15 నిముషాలు ఉంటుందని అనుకున్నా... సినిమా పూర్తి అయ్యేసరికి రెండున్నర గంటలు పడుతుంది. ఏఎంబీలో షో ఏడున్నరకు కాబట్టి... గురువారం (అక్టోబర్ 16వ తేదీ) రాత్రి పది గంటలకు సినిమా రిజల్ట్ ఏమిటి? అనేది తెలుస్తుంది. 'తెలుసు కదా' ట్విట్టర్ రివ్యూలతో పాటు ప్రీమియర్స్ రిపోర్ట్ కూడా ఇవాళ (అంటే గురువారం, అక్టోబర్ 16వ తేదీ) రాత్రికి వచ్చేస్తాయి.
సిద్ధూ కెరీర్‌కు సినిమా విజయం కీలకం!
'డీజే టిల్లు', 'టిల్లు స్క్వేర్' సినిమాలతో సిద్ధూ జొన్నలగడ్డ యంగ్ స్టార్ హీరోల జాబితాలో చేరాడు. అతడికి 'స్టార్ బాయ్' ట్యాగ్ ఇచ్చారు. అయితే 'జాక్' రిజల్ట్ సిద్ధూకి షాక్ ఇచ్చింది. అందువల్ల, 'తెలుసు కదా' విజయం అతనికి కీలకంగా మారింది.
'తెలుసు కదా'లో సిద్ధూ జొన్నలగడ్డ సరసన రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించారు. హర్ష చెముడు కీలక పాత్ర చేశారు. ఈ సినిమాతో ప్రముఖ స్టైలిస్ట్, ఫేమస్ రైటర్ కోన వెంకట్ కజిన్ నీరజ కోన దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. 'మిరాయ్' విజయం తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న చిత్రమిది. తమన్ సంగీతం అందించారు. 'మల్లిక గంధ' పాట చార్ట్ బస్టర్ అయింది. సినిమా ఎలా ఉంటుందో చూడాలి మరి.
Also Read: మిత్ర మండలి రివ్యూ: ప్రియదర్శి & గ్యాంగ్ నవ్వించిందా? లేదా?... సినిమా హిట్టా? ఫట్టా?