Cricketer Tilak Varma Met Megastar Chiranjeevi: ఆసియా కప్ హీరో, యంగ్ క్రికెటర్ తిలక్ వర్మ మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ప్రస్తుతం చిరు అనిల్ రావిపూడి కాంబోలో 'మన శంకరవరప్రసాద్ గారు' మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మూవీ సెట్స్‌లో చిరును తిలక్ వర్మ కలిశారు. రీసెంట్‌గా పాకిస్థాన్‌తో ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో తిలక్ వర్మ విధ్వంసకర బ్యాటింగ్‌తో తీవ్ర ఒత్తిడిలోనూ ఘన విజయాన్ని అందించారు. దీంతో ఈ యంగ్ క్రికెటర్‌పై దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి.
తిలక్ వర్మను శాలువాతో సత్కరించిన చిరంజీవి పువ్వుల మాలతో సన్మానించారు. అంతే కాకుండా ఐకానిక్ మ్యాచ్ విన్నింగ్ మూమెంట్‌ను గుర్తు చేసే స్పెషల్ ఫోటోను గిఫ్ట్‌గా అందించారు. ఈ సందర్భంగా తిలక్ వర్మపై ప్రసంసలు కురిపించారు. తిలక్ అంకితభావం, డిసిప్లీన్, ఆటతీరును ప్రత్యేకంగా అభినందించారు. ఆ తర్వాత మూవీ టీం కేక్ కట్ చేయించింది. చిరు స్వయంగా తిలక్‌కు కేక్ తినిపించారు. ఆయనతో పాటు నయనతార, డైరెక్టర్ అనిల్ రావిపూడి, ఇతర చిత్ర బృందం ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
Also Read: పాలిటిక్స్ టచ్ చేయనున్న కింగ్ నాగార్జున! - సీఎం ఎవరో తెలుసా?... 100వ సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్