Rishab Shetty's Kantara Chapter 1 OTT Release: కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హీరోగా వచ్చిన లేటెస్ట్ పీరియాడికల్ మైథలాజికల్ డ్రామా 'కాంతార చాప్టర్ 1' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నెల 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ రికార్డు కలెక్షన్స్ సాధించింది. ప్రస్తుతం ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా? అని మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అప్పటి నుంచి స్ట్రీమింగ్?
'కాంతార చాప్టర్ 1' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో' సొంతం చేసుకోగా... ఓటీటీ ప్లే రిపోర్ట్ ప్రకారం ఈ నెల 30 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. కన్నడతో పాటు, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఆ రోజు నుంచి మూవీ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక హిందీ వెర్షన్ మాత్రం ఒప్పందం ప్రకారం థియేట్రికల్ రన్ అయిన 8 వారాల తర్వాత ఓటీటీలోకి స్ట్రీమింగ్ కానుంది.
Also Read: స్టేజీపై హీరోయిన్ బుగ్గ గిల్లిన హీరో - నిజంగా క్యూట్‌గా లేదన్న హీరోయిన్... వీడియో వైరల్
స్పెషల్ ట్రైలర్ రిలీజ్
ఇప్పటికే మూవీ థియేటర్లలో సందడి చేస్తుండగా తాజాగా మూవీ టీం స్పెషల్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. మూవీలో కీలక సీన్స్‌తో ఓ స్పెషల్ ట్రైలర్ రిలీజ్ చేసింది. 'ప్రకృతిని ఆరాధించే మన వాళ్లు ఆ రాయిలో దైవత్వాన్ని చూసే లోపే తేటతెల్లని నీరు రక్తంతో ఎరుపెక్కింది.' 'ఈ మట్టిలో దైవత్వం మళ్లీ మళ్లీ పుడుతుంది' అనే డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. భారీ యాక్షన్ సీక్వెన్స్, శివ గణాల ఉగ్ర రూపం ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ కొత్త ట్రైలర్ ట్రెండ్ అవుతోంది.
12 రోజుల్లోనే...
రిలీజ్ అయిన 12 రోజుల్లోనే రూ.675 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. వారం రోజుల్లోనే రూ.500 కోట్ల క్లబ్‌లోకి చేరింది. కన్నడ పరిశ్రమలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. 2022లో వచ్చిన 'కాంతార'కు ప్రీక్వెల్‌గా ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ అనుకున్నట్లుగానే రికార్డులు కొల్లగొడుతోంది. ఈ మూవీలో రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూనే స్వీయ దర్శకత్వం వహించారు. రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించగా... ప్రమోద్ శెట్టి, గుల్షన్ దేవయ్య, జయరాం కీలక పాత్రలు పోషించారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదూర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.
స్టోరీ ఏంటంటే?
కందబుల కాలంలో ఓ దిక్కున అటవీ ప్రాంతంలో ఉండే దైవిక భూమి 'కాంతార'. అక్కడ ఈశ్వరుని పూదోట, మహిమ గల బావికి రక్షణగా కాంతార తెగ వారు కాపలా కాస్తుంటారు. బావిలో దొరికే బిడ్డకు బెర్మె (రిషబ్ శెట్టి) అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుతారు. ఈశ్వరుని పూదోటపై కన్నేసిన బాంగ్రా రాజు దారుణంగా ప్రాణాలు కోల్పోగా... తన తండ్రి మృతిని కళ్లారా చూసిన రాజశేఖరుడు (జయరాం) కాంతార జోలికి వెళ్లడు. కానీ అతని వారసుడు కులశేఖరుడు (గుల్షన్ దేవయ్య) కాంతారను చేజిక్కించుకోవాలని చూస్తాడు.
ఆ తర్వాత ఏం జరిగింది? తమను ఊచకోత కోయాలని చూసిన కులశేఖరున్ని బెర్మె ఎలా ఎదుర్కున్నాడు? అసలు ఈశ్వరుని పూదోట వెనుక ఉన్న స్టోరీ ఏంటి? కాంతార దైవిక భూమిలో ఉన్న దైవ గణాల రహస్యం ఏంటి? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.