Pradeep Ranganathan Mamitha Baiju Fun On Stage: 'లవ్ టుడే', 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' మూవీస్‌తో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు కోలీవుడ్ స్టార్ ప్రదీప్ రంగనాథన్. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ లవ్ ఎంటర్టైనర్ 'డ్యూడ్' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీలో 'ప్రేమలు' ఫేం మమితా బైజు హీరోయిన్. ఈ సందర్భంగా మూవీ టీం ప్రమోషన్స్ స్పీడప్ చేసింది. తాజాగా బుధవారం నిర్వహించిన స్వాగ్ ఈవెంట్‌లో హీరో హీరోయిన్లు స్టేజీపై సందడి చేశారు.
హీరోయిన్ బుగ్గ గిల్లిన హీరో
ఈవెంట్‌లో యాంకర్ హీరో హీరోయిన్లకు ఫన్ టాస్క్ ఇచ్చారు. హీరోయిన్ మమితా బైజు తన యాక్టివిటీస్‌తో ప్రదీప్ రంగనాథన్‌ను నవ్వించేలా చూడాలని టాస్క్ ఇవ్వగా ఆమె అలానే చేశారు. ఇక 'డ్యూడ్' మూవీ ట్రైలర్‌లో ఓ సీన్‌ను రీక్రియేట్ చేశారు. మూవీలో హీరోను బుగ్గ గిల్లి క్యూట్ అని పీలవుతుంది మమిత. ఇప్పుడు అదే సీన్‌ను స్టేజ్‌పై రివర్స్‌లో రీ క్రియేట్ చేశారు. స్టేజీపై ప్రదీప్... మమితా బుగ్గ గిల్లి జుట్టు పట్టుకుని లాగారు. అలాగే వెనుక నుంచి కొడుతున్నట్లు ఫీలవుతూ సీన్‌లో లీనమైపోయారు. ఇది క్యూట్‌గా లేదంటూ మమితా చెప్పగా... 'నిజంగానే క్యూట్‌గా లేదమ్మా... మరీ ఇంత వయలెంట్‌గా ఉన్నారేంటి?' అంటూ యాంకర్ అనగా అంతా నవ్వేశారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు నెటిజన్లు దీనిపై ట్రోల్ చేస్తున్నారు. స్టేజీపై అతి చేశారంటూ కామెంట్స్ చేస్తుండగా... మరికొందరు మాత్రం సీన్ రీ క్రియేషన్‌లో ఫన్ చేశారని... అందులో తప్పేముంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇదే ఈవెంట్‌లో మమితా డ్యాన్స్ కూడా చేశారు. తెలుగు ఆడియన్స్ తమ కుటుంబంలో తనను ఒకరిగా చూసినట్లు హీరో ప్రదీప్ తెలిపారు. 'లవ్ టుడే, డ్రాగన్ మూవీస్ మీకు నచ్చాయంటే కచ్చితంగా డ్యూడ్ కూడా నచ్చుతుంది. ఇది ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్.' అని చెప్పారు.
Also Read: థియేటర్లలో నవ్వుల 'మిత్ర మండలి' - ఏ ఓటీటీలోకి వస్తుందో తెలుసా?
ఈ మూవీకి కీర్తిశ్వరన్ దర్శకత్వం వహిస్తుండగా... ఆయనకు ఇదే ఫస్ట్ మూవీ. సీనియర్ హీరో శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తుండగా... రోహిణి మొల్లేటి, హృదు హరూన్, ద్రవిడ్ సెల్వం తదితరులు కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ మూవీని నిర్మించారు. సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందించారు.