Manchu Lakshmi's Daksha Movie OTT Release Date Locked: చాలా రోజుల గ్యాప్ తర్వాత మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ 'దక్ష'. వంశీకృష్ణ మల్లా దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చి అంతగా ఆకట్టుకోలేకపోయింది. నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మంచు లక్ష్మి.

Continues below advertisement

ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో ఈ నెల 17 (శుక్రవారం) నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు మంచు లక్ష్మి సోషల్ మీడియా వేదికగా అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. దీపావళి సందర్భంగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు చెబుతూనే స్పెషల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

Continues below advertisement

ఈ మూవీలో మోహన్ బాబు అతిథి పాత్రలో మెరిశారు. వీరితో పాటే, సముద్ర ఖని, 'రంగస్థలం' మహేష్, యంగ్ హీరో విశ్వంత్ దుద్దుంపూడి, మలయాళ యాక్టర్ సిద్ధిఖీ కీలక పాత్రలు పోషించారు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మంచు లక్ష్మి నటించారు. శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా మూవీని నిర్మించాయి.

Also Read: ఓటీటీలోకి విజయ్ ఆంటోని పొలిటికల్ థ్రిల్లర్ 'భద్రకాళి' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

స్టోరీ ఏంటంటే?

హైదరాబాద్ నగరంలో ఓ కంటైనర్ యార్డులో వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందుతాడు. ఈ కేసును సీఐ దక్ష (మంచు లక్ష్మి) డీల్ చేస్తుంది. ఆ తర్వాత అమెరికా నుంచి వచ్చిన ఓ ఫార్మా కంపెనీ ప్రతినిధి కూడా మర్డర్‌కు గురవుతాడు. రెండు కేసుల్లో క్లూస్ ఒకే విధంగా ఉండడంతో దీని వెనుక ఏదో నెట్వర్క్ ఉందని భావిస్తుంది దక్ష. ఒకే విధమైన గ్యాస్ రిలీజ్ చేసి దుండగులు ఈ హత్యలకు పాల్పడినట్లు గుర్తిస్తుంది.

మరోవైపు 'దక్ష'పై డాక్యుమెంటరీ తీయాలని జర్నలిస్ట్ సురేశ్ (జెమినీ సురేశ్) ఆమెను ఫాలో అవుతాడు. అతను సేకరించిన సమాచారం ఓ నిజం వెలుగుచూస్తుంది. ఈ క్రమంలో ఆమెను విచారణ నుంచి తప్పించి ఈ కేసులను ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన విక్రమ్ (విశ్వంత్ దుద్దుంపూడి)కి కమిషనర్ (సముద్రఖని) అప్పగిస్తారు. అసలు ఈ హత్యలకు పాల్పడింది ఎవరు? సురేష్ ఇన్వెస్టిగేషన్‌లో తెలిసిన నిజం ఏంటి? ఈ కేసులో పోలీసులకు సైక్రియాట్రిస్ట్ విశ్వామిత్ర ఎలాంటి సాయం చేశారు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.