Vijay Antony's Bhadrakaali OTT Release On Jio Hotstar: కోలీవుడ్ స్టార్ విజయ్ ఆంటోనీ రీసెంట్ పొలిటికల్ థ్రిల్లర్ 'భద్రకాళి'. గత నెల 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. నెల రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. 

Continues below advertisement

ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

'భద్రకాళి' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ 'జియో హాట్ స్టార్' సొంతం చేసుకోగా ఈ నెల 24 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్  కానుంది. 'ప్రతీ ఒక్కరి మైండ్ ఓ బ్రిలియంట్ మాస్టర్. మీట్ ది మాస్టర్ మైండ్' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. తమిళంలో 'శక్తి తిరుమగన్' మూవీని తెలుగులో 'భద్రకాళి'గా రీమేక్ చేశారు. మైత్రీ డిస్ట్రిబ్యూటర్స్ మూవీని తెలుగులో రిలీజ్ చేశారు.

Continues below advertisement

ఈ మూవీకి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా... విజయ్ ఆంటోనీ హీరోగానే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్‌గానూ వ్యవహరించారు. దీంతో పాటే నిర్మాణ బాధ్యతలు నిర్వర్తించారు. విజయ్‌తో పాటు సునీల్ కృపలానీ, తృప్తి రవీంద్ర, వాగై చంద్రశేఖర్, సెల్ మురుగన్, మాస్టర్ కేశవ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 

Also Read: ఓటీటీలోకి 'దృశ్యం' డైరెక్టర్ క్రైమ్ థ్రిల్లర్ - తెలుగులోనూ చూసెయ్యండి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?

స్టోరీ ఏంటంటే?

సెక్రటేరియట్‌లో కిట్టు (విజయ్ ఆంటోని) ఓ పవర్ బ్రోకర్. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ వ్యవహారం చక్కబెట్టాలన్నా, అది ఎంత కష్టమైనా తనదైన శైలి, నేర్పుతో వ్యవస్థల్లో పెద్దలను ఉపయోగించుకుని చక్కబెడుతుంటాడు. కేవలం అలాంటి పనులే కాకుండా మంచి పనులు కూడా చేస్తుంటాడు. అలా కేంద్ర మంత్రికి సంబంధించి రూ.800 కోట్ల భూమి వ్యవహారంలోనూ వేలు పెడతాడు. ఈ క్రమంలో ఓ ఎమ్మెల్యే హత్యకు గురవడం సదరు మంత్రికి తలనొప్పిగా మారుతుంది.

దీంతో రహస్యంగా విచారణకు ఆదేశించగా... దీని వెనుక ఉన్నది కిట్టు అని తెలిసి మంత్రి షాక్ అవుతారు. అంతే కాకుండా లాబీయింగ్స్ రూపంలో దాదాపు రూ.6 వేల కోట్లకు పైగా వెనకేసినట్లు తెలుస్తుంది. దీంతో కిట్టును అరెస్ట్ చేయగా... దీని వెనుక రాష్ట్రపతి రేసులో ఉన్న అభ్యర్థి అభ్యంకర్ (సునీల్ కిర్బాలానీ) ఉంటాడని తెలుస్తుంది. దేశంలో నేతలందరినీ తన చెప్పు చేతల్లో పెట్టుకున్న అభ్యంకర్‌ను తలకు మించిన కేసుల్లో చిక్కుకున్న కిట్టు ఎలా అడ్డుకున్నాడు? అసలు కిట్టుకు, అభ్యంకర్‌కు ఉన్న సంబంధం ఏంటి? సెక్రటేరియట్ ముందు కాఫీలు అమ్ముకునే కిట్టు అతి పెద్ద లాబీయర్‌‌గా ఎలా ఎదిగాడు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.