New Movies List To Exclusively Released In Netflix: ప్రస్తుతం ఓటీటీల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఆడియన్స్ ఇంట్రెస్ట్‌కు అనుగుణంగా ఎక్స్‌క్లూజివ్ కంటెంట్‌ను ఓటీటీ సంస్థలు అందుబాటులో ఉంచుతున్నాయి. రీసెంట్‌గా కొన్ని మూవీస్ నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' త్వరలో అందుబాటులోకి రాబోయే తమిళ, తెలుగు మూవీస్, వెబ్ సిరీస్‌ల లిస్ట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.

Continues below advertisement

'OG' హీరోయిన్ 'మేడ్ ఇన్ కొరియా'

రీసెంట్‌‌గా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'OG'లో హీరోయిన్‌గా నటించిన ప్రియాంక మోహన్ మంచి ఫేమ్ సంపాదించుకున్నారు. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో నటించిన మూవీ 'మేడ్ ఇన్ కొరియా'. కొరియన్ చిత్రాలు, సిరీస్‌లకు ఫ్యాన్ అయిన ఓ అమ్మాయి కొరియా వెళ్లిన తర్వాత ఏం జరిగింది అనేదే ఈ మూవీ స్టోరీ. ఈ సినిమాకు ఆర్ఏ కార్తీక్ దర్శకత్వం వహించగా... శ్రీనిధి సాగర్ నిర్మించారు. ఎక్స్‌క్లూజివ్‌గా 'నెట్ ఫ్లిక్స్'లో త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. 'దక్షిణ భారత ప్రకంపనలు కొరియా కలలను కలుసుకుంటాయి. ఒక అమ్మాయి... ఒక కథ... రెండు సంస్కృతులు. తర్వాత ఏం జరిగింది?' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. 

Continues below advertisement

సందీప్ కిషన్ 'సూపర్ సుబ్బు'

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ 'సూపర్ సుబ్బు'. ఈ సిరీస్‌కు మాలిక్ రామ్ దర్శకత్వం వహించగా చిలకా ప్రొడక్షన్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. మిథిలా పాల్కర్, మురళీ శర్మ కీలక పాత్రలు పోషించారు. పల్లెటూరిలో పిల్లలకు ఓ టీచర్ సెక్స్ ఎడ్యుకేషన్ నేర్పించాల్సి వస్తే ఏం జరుగుతుంది?... ఈ క్రమంలో ఎదురయ్యే పరిణామాలను ఇందులో చూపించారు. చేతిలో బుక్, భుజానికి బ్యాగ్‌తో సందీప్ కిషన్ లుక్ అదిరిపోయింది.

ఆనంద్ దేవరకొండ 'తక్షకుడు'

టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ హీరోగా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన మూవీ 'తక్షకుడు'. ఎక్స్‌క్లూజివ్‌గా 'నెట్ ఫ్లిక్స్'లోనే స్ట్రీమింగ్ కానుంది. 'మిడిల్ క్లాస్ మెలోడీస్' ఫేం వినోద్ దర్శకత్వం వహించనుండగా... 'లాపతా లేడీస్' మూవీ ఫేం నితాన్సీ గోయల్ హీరయిన్‌గా నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మూవీని నిర్మిస్తున్నారు. 

ఇక మిథున్ దర్శకత్వంలో 'స్టీఫెన్' మూవీ కూడా డైరెక్ట్‌గా 'నెట్ ఫ్లిక్స్'లోనే స్ట్రీమింగ్ కానుంది. దీంతో పాటే యూత్ ఫుల్ సిరీస్ 'లవ్' కూడా స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్‌కు బాలాజీ మోహన్ దర్శకత్వం వహిస్తుండగా... సౌందర్య రజినీకాంత్ నిర్మించారు.