Anand Deverakonda's Thakshakudu Movie OTT Release On Netflix: ప్రస్తుతం ఓటీటీ ట్రెండ్ పెరుగుతున్న క్రమంలో టాలీవుడ్ యంగ్ హీరోస్ దాన్నే ఫాలో అవుతున్నారు. కేవలం థియేటర్స్‌లోనే కాకుండా ఓటీటీల్లోనూ మూవీస్ కోసం రెడీ అవుతున్నారు. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తమ్ముడు, టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ లేటెస్ట్ మూవీ త్వరలోనే ఓటీటీలోకి రానుంది.
నేరుగా ఓటీటీలోకే...
డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఆనంద్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'తక్షకుడు' నేరుగా ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్'లోనే రిలీజ్ కానుంది. 'అత్యాశతో ప్రారంభమై ప్రతీకారం వస్తుంది.' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఓ సరికొత్త యాక్షన్ డ్రామాతో ఆనంద్ దేవరకొండ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ మూవీ 'మిడిల్ క్లాస్ మెలోడీస్' డైరెక్టర్ వినోద్ దర్శకత్వం వహిస్తుండగా... 'లాపతా లేడీస్' ఫేం నితాన్షీ గోయల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై మూవీని నిర్మించనున్నారు.
తాజాగా ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేయగా చేతిలో గన్‌తో మాస్ లుక్‌లో అదరగొట్టారు. ఇక ఊరు తగలబడినట్లు ఉండగా... ఓ భారీ పోరాటం బ్యాక్ డ్రాప్‌గా మూవీ సాగబోతున్నట్లు తెలుస్తోంది. 'వేటగాడి చరిత్రలో జింకపిల్లలే నేరస్థులు' అంటూ హైప్ ఇచ్చారు మేకర్స్. అసలు వేటగాడు ఎవరు? జింకపిల్లలను ఏం చేయబోతున్నాడు? ఈ వేటగాడి ప్రతీకారానికి కారణం ఏంటి? అనేది కాస్త సస్పెన్స్. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, ఇతర వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
Also Read: నవ్వుల 'మిత్ర మండలి' To లవ్ ఎంటర్టైనర్ 'డ్యూడ్' - ఈ దీపావళికి వినోదాల విందు కన్ఫర్మ్
ప్రస్తుతం ఆనంద్ మరో మూవీతోనూ బిజీగా ఉన్నారు. ప్రొడక్షన్ నెం.32 వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తుండగా... 90s వెబ్ సిరీస్ ఫేం ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించనున్నారు. ఆ సిరీస్‌కు సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే, ఆనంద, వైష్ణవి చైతన్య కపుల్ 'బేబీ' మూవీతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇప్పుడు కూడా అదే కాంబో రిపీట్ కానుంది.