Bellamkonda Sai Sreeniavas's Kishkindhapuri OTT Release On Zee5: టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన రీసెంట్ హారర్ థ్రిల్లర్ 'కిష్కింధపురి'. సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.
ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
'కిష్కింధపురి' ఓటీటీ రిలీజ్ డేట్‌పై గత కొద్ది రోజులుగా ఎన్నో తేదీలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా ప్రకటించింది సదరు ఓటీటీ సంస్థ. ప్రముఖ ఓటీటీ 'జీ5' వేదికగా ఈ నెల 17న సాయంత్రం 6 గంటల నుంచి స్ట్రీమింగ్ కానుంది. 'భయం మిమ్మల్ని చూసి మీ భయాలను కనుగొంటుంది.' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అలాగే, ఈ నెల 19న ఆదివారం సాయంత్రం 6 గంటలకు జీ తెలుగు ఛానల్‌లో ప్రీమియర్ కానుంది.
Also Read: ఓటీటీలోకి వచ్చేసిన 'మిరాయ్' - 4 భాషల్లోనే స్ట్రీమింగ్... ఇప్పుడే చూసెయ్యండి
ఈ మూవీకి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించగా... సాయి శ్రీనివాస్, అనుపమలతో పాటు హైపర్ ఆది, తనికెళ్ల భరణి, శాండీ మాస్టర్, మర్కంద్ దేశ్ పాండే, హినా భాటియా, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు. చైతన భరద్వాజ్ మ్యూజిక్ అందించగా... షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై అర్చన సమర్పణలో సాహు గారపాటి నిర్మించారు. బెల్లంకొండ కెరీర్‌లో ఇది 11వ మూవీ కాగా... అనుపమతో రెండో మూవీ. ఇంతుకు ముందు వీరిద్దరూ కలిసి 'రాక్షసుడు'లో కలిసి నటించారు.
స్టోరీ ఏంటంటే?
హారర్, థ్రిల్లింగ్ అంశాలు కలగలిపి 'కిష్కింధపురి' ఆడియన్స్‌కు మంచి థ్రిల్ పంచింది. ఇక కథ విషయానికొస్తే... రాఘవ్ (బెల్లంకొండ సాయి శ్రీనివాస్), మైథిలి (అనుపమ పరమేశ్వరన్) ఇద్దరూ లవర్స్. వీరిద్దరూ కలిసి తమ ఫ్రెండ్ (సుదర్శన్)తో కలిసి ఘోస్ట్ వాకింగ్ పేరుతో హాంటెడ్ హౌసెస్ టూర్స్ నిర్వహిస్తుంటారు. ఎవరైతే థ్రిల్ కోరుకుంటున్నారో అలాంటి వారిని ఓ చోట చేర్చి వారిని పాడుపడిన బంగ్లాల చుట్టూ తిప్పుతుంటారు. అలా ఓ సారి 11 మందితో 'కిష్కింధపురి' గ్రామంలో 'సువర్ణమాయ' అనే పాడుపడిన రేడియో స్టేషన్‌కు వెళ్తారు.
1989లోనే పాడుపడిన ఆ స్టేషన్‌లోకి వెళ్లిన ఈ 11 మందికి వేదవతి అనే వాయిస్‌తో వార్నింగ్ వస్తుంది. ఈ క్రమంలో అందరూ తిరిగి వచ్చేయగా... 11 మందిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోతారు. ఇక నెక్స్ట్ ఓ చిన్నారి టార్గెట్ కాగా ఆ చిన్నారిని కాపాడేందుకు రాఘవ్ ఏం చేశాడు? అసలు వేదవతి ఎవరు? సువర్ణమాయ స్టేషన్‌తో ఆమెకు ఉన్న సంబంధం ఏంటి? మిగిలిన వారిని ఎలా కాపాడాడు? సువర్ణమాయ బంగ్లాలో దెయ్యం ఉందా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.