Teja Sajja's Mirai OTT Streaming On Jio Hotstar: పిల్లల నుంచి పెద్దల వరకూ మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న యంగ్ హీరో తేజ సజ్జా 'మిరాయ్' ఓటీటీలోకి వచ్చేసింది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ సూపర్ అడ్వెంచర్ థ్రిల్లర్ సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్ సాధించింది. తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
4 భాషల్లోనే స్ట్రీమింగ్
ప్రముఖ ఓటీటీ 'జియో హాట్ స్టార్'లో గురువారం అర్ధరాత్రి నుంచి 'మిరాయ్' స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. హిందీ వెర్షన్ స్ట్రీమింగ్‌కు టైమ్ పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. 8 వారాల కండీషన్ పెట్టడంతోనే హిందీలో అందుబాటులోకి వచ్చేందుకు టైం పడుతుంది. 'ఎక్స్‌పీరియన్స్ ది పవర్ ఆఫ్ బ్రహ్మాండ్. ఇది చరిత్ర, ఇది భవిష్యత్తు, ఇదే మిరాయ్.' అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
Also Read: రోజుకు 8 గంటల వర్క్ - స్పిరిట్, కల్కి 2 నుంచి తప్పించడంపై దీపికా ఫస్ట్ రియాక్షన్
మూవీలో సూపర్ యోధుడిగా తేజ సజ్జా అద్భుతంగా నటించారు. మహవీర్ సింగ్ లామాగా నెగిటివ్ రోల్‌లో మంచు మనోజ్ అదరగొట్టారు. తేజ సరసన రితికా నాయక్ హీరోయిన్‌గా నటించగా... శ్రియా, జగపతిబాబు, కౌశిక్ మెహతా, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రలు పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ మూవీని నిర్మించారు. వీఎఫ్ఎక్స్ వర్క్స్, విజువల్స్‌కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు.
స్టోరీ ఏంటంటే?
అశోకుడు కళింగ యుద్ధం తర్వాత జరిగిన విధ్వంసానికి తీవ్ర పశ్చాత్తాపంతో తనలోని దైవశక్తిని 9 గ్రంథాల్లో నిక్షిప్తం చేస్తాడు. వీటికి 9 మంది యోధులను రక్షణగా పెడతాడు. తరతరాలుగా ఆ యోధుల వారసులు వాటిని రక్షిస్తూ ఉంటారు. అయితే, ఈ గ్రంథాలపై కొన్ని శతాబ్దాల తర్వాత మహావీర్ లామా (మంచు మనోజ్) కన్ను పడుతుంది. అన్నింటినీ తన హస్త గతం చేసుకుని చావుని జయించి లోకాన్ని ఏలాలని కలలు కంటుంటాడు. తన మంత్ర శక్తులతో 8 గ్రంథాలను సొంతం చేసుకుంటాడు.
ఇక అమరత్వ రహస్యాలు ఉండే 9వ గ్రంథం చేజిక్కుంచుకోవడం అంత సులువు కాదు. దీనికి అంబిక (శ్రియా) రక్షణగా ఉంటుంది. ఈ గ్రంథ రక్షణ కోసం ఆమె తన బిడ్డ వేద (తేజ సజ్జా)ను చిన్నప్పుడే దూరం చేసుకుంటుంది. ప్రపంచానికి లామా నుంచి రాబోయే ముప్పును ముందే ఊహించిన అంబిక ఆ గ్రంథాన్ని ఓ చోట దాచిపెడుతుంది. అనాథగా పెరిగిన వేద తన తల్లి గురించి తెలుసుకుంటాడా? 9వ గ్రంథాన్ని చేజిక్కుంచుకునేందుకు లామా ఏం చేశాడు? అతన్ని వేద ఎలా అడ్డుకున్నాడు? 9 గ్రంథానికి మిరాయ్‌కు సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.