Bramarambika tutika's Anandalahari Web Series OTT Release On Aha: ఈస్ట్ గోదావరి అబ్బాయి, వెస్ట్ గోదావరి అమ్మాయి మధ్య లేటెస్ట్ క్యూట్ లవ్ స్టోరీ 'ఆనందలహరి'. ఈ సిరీస్‌లో అభిషేక్ బొడ్డేపల్లి హీరోగా నటించగా... పెళ్లి చూపులు, వింధ్యా విహారి వంటి వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులకు పరిచయమైన ఫేమస్ యూట్యూబర్ బ్రమరాంబికా  తూటికా హీరోయిన్‌గా నటించారు. సిరీస్‌కు సాయి వనపల్లి దర్శకత్వం వహించగా... సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రవీణ్ ధర్మపురి నిర్మించారు.

దీపావళి కానుకగా...

ఈ అందమైన వెబ్ సిరీస్ దీపావళి కానుకగా ప్రముఖ ఓటీటీ 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నెల 17 నుంచి అందుబాటులో ఉండనున్నట్లు సదరు ఓటీటీ సంస్థ ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. 'ఇదిగో మా ఈస్ట్ గోదావరి అబ్బాయి ఆనంద్. అదిగో మా వెస్ట్ గోదావరి అమ్మాయి లహరి.. వీళ్లిద్దరి హడావిడి... అక్టోబర్ 17 నుంచి సూసేద్దాం.' అంటూ రాసుకొచ్చింది. గోదావరి జిల్లాల్లో అందమైన పల్లెటూళ్లలో హుషారైన ఓ అబ్బాయి, అందం, అమాయకత్వం కలగలిసిన ఓ అమ్మాయి మధ్య జరిగే లవ్ స్టోరీ ఈ సిరీస్ అని తెలుస్తోంది. మరి వీరి అల్లరి ఏంటో చూడాలంటే రిలీజ్ అయ్యే వరకూ వెయిట్ చేయాల్సిందే.

Also Read: కన్నడ బిగ్ బాస్ హౌస్‌కు లైన్ క్లియర్ - డిప్యూటీ సీఎం, అధికారులకు హోస్ట్ కిచ్చా సుదీప్ థాంక్స్