Telusu Kada Movie Review In Telugu: ప్రముఖ స్టయిలిస్ట్ నీరజ కోన దర్శకురాలిగా పరిచయమైన సినిమా 'తెలుసు కదా'. లవ్ యూ 2... మూవీ క్యాప్షన్. స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించారు. ఆయనకు జంటగా రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి యాక్ట్ చేశారు. హర్ష చెముడు కీలక పాత్ర పోషించారు. హైదరాబాద్ సిటీలోని ఏఎంబీ మల్టీప్లెక్స్‌లో గురువారం (అక్టోబర్ 16వ తేదీ) రాత్రి 7.20 గంటలకు ప్రీమియర్ షో ప్రదర్శించారు. మరి సినిమా టాక్ ఏంటి? సోషల్ మీడియాలో సిద్ధూ సినిమా గురించి ఏం అంటున్నారు? అనేది ఓ లుక్ వేయండి.
మాటల్లేవ్... ట్రెండ్ సెట్టింగ్ సినిమా!'తెలుసు కదా' చూశాక తనకు మాటలు రావడం లేదని ఒక నెటిజన్ ట్వీట్ చేశారు. ఈతరం యువతను తెరపై అందంగా చూపించిన ట్రెండ్ సెట్టింగ్ సినిమా అని పేర్కొన్నారు. సిద్ధూ, రాశి, శ్రీనిధి బాగా నటించారని... మనసును తాకేలా నీరజ కోన రైటింగ్ ఉందని... సంగీతం బావుందని చెప్పుకొచ్చారు. ఇదొక సినిమాటిక్ గోల్డ్ అని చెప్పడం విశేషం.
ఎలా... ఊహించుకుంటేనే భయంగా!'తెలుసు కదా' న్యూ ఏజ్ సినిమా అని మరొక నెటిజన్ పేర్కొన్నారు. సిద్ధూ బాయ్ వన్ మ్యాన్ షో చేశారని, టెర్రిఫిక్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడని అతడిని ఆకాశానికి ఎత్తేశారు. ''ఒరేయ్... మూవీలో ఇంత కంటెంట్ పెట్టుకుని అంత సైలెంట్‌గా వచ్చారు ఏంట్రా? ఎలా చేశావ్ రా నాయనా ఆ రోల్ ని. రియల్ లైఫ్ లో ఊహించుకుంటేనే భయంగా ఉంది'' అని ట్వీట్ చేశారు.
వల్గారిటీ లేకుండా చెప్పారు లేడీ డైరెక్టర్!'తెలుసు కదా' సినిమాను నిజంగా లేడీ డైరెక్టరేనా తీసింది? అని ఓ నెటిజన్ ప్రశ్నించారు. చెప్పాల్సిన పాయింట్ అనవసరమైన వల్గారిటీ లేకుండా చెప్పారని పేర్కొన్నారు. సిద్ధూ జొన్నలగడ్డ, హర్ష కామెడీ ట్రాక్ రవితేజ - బ్రహ్మి కాంబోని గుర్తు చేసిందని, ఓవరాల్‌గా చూసుకుంటే ఇదొక మంచి సినిమా అని పేర్కొన్నారు.
Also Read: మిత్ర మండలి రివ్యూ: ప్రియదర్శి & గ్యాంగ్ నవ్వించిందా? లేదా?... సినిమా హిట్టా? ఫట్టా?
రెగ్యులర్ లవ్ స్టోరీలా లేదని ఒకరు, సినిమాలో సర్‌ప్రైజ్‌లు చాలా ఉన్నాయని మరొకరు, మోడ్రన్ రిలేషన్షిప్స్ మీద తీసిన మంచి సినిమా అని ఇంకొకరు చెప్పారు. 'తెలుసు కదా' సినిమా గురించి సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందో ఒక లుక్ వేయండి.