సినిమాకు పునాది నాటకం అని చెప్పాలి. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో తొలి తరం కళాకారుల్లో ఎక్కువ శాతం మంది నాటకాల నుంచి వచ్చినవారే. ఇప్పుడు ఆ నాటక రంగానికి ఆదరణ తగ్గుతోంది. అంతరించిపోతుందని చెప్పాలి. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన సురభి నాటకాలు, కళాకారులు ఆదరణ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు.
అంతరించిపోతున్న నాటక రంగం, కళాకారుల నేపథ్యంలో రూపొందిన సినిమా 'ఉత్సవం'. అర్జున్ సాయి దర్శకత్వం వహించారు. హార్న్ బిల్ పిక్చర్స్ పతాకంపై సురేష్ పాటిల్ నిర్మించారు. ఇందులో దిలీప్ హీరో. రెజీనా హీరోయిన్. ప్రకాష్ రాజ్, నాజర్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, అలీ, 'రచ్చ' రవి, రఘుబాబు, ప్రియదర్శి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ అయ్యాయి. విడుదలకు రెడీగా ఉంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో ఫస్ట్ లుక్, టీజర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Also Read: '9 అవర్స్' రివ్యూ: వెబ్ సిరీస్ చూశాక ఆ ఒక్క ప్రశ్న మిమ్మల్ని వెంటాడుతుంది
సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ ప్రతి ఫ్రేమును అందంగా తీర్చి దిద్దారని... సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ పాటలు, నేపథ్య సంగీతంతో సినిమాకు ప్రాణం పోశారని చిత్ర బృందం పేర్కొంది. అనంత్ శ్రీరామ్, భాస్కరభట్ల, వనమాలి పాటలు రాసిన ఈ చిత్రానికి ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు, ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి.
Also Read: కమల్ సినిమాకూ రేట్లు తగ్గించారు - ఇకనుంచి ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతారా?