తెలుగు చలన చిత్ర పరిశ్రమ (Telugu Film Industry) లో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. ఈ మధ్య కాలంలో నిర్మాణ వ్యయం పెరగడం, పరాజయాల శాతం ఎక్కువ కావడంతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి ఏం చేయాలని కొన్ని రోజులుగా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు సమాలోచనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో నిర్మాతల మండలి (Telugu Film Producers Council) కొన్ని కీలక నిర్మాణాలు తీసుకున్నట్లు తెలిసింది. భారీ సినిమాలు థియేటర్లలో విడుదలైన పది వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇంకా నిర్మాణ వ్యయం, టికెట్ ధరలపై పలు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిసింది.
నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయాలు:
- అగ్ర హీరోలు, భారీ నిర్మాణ వ్యయంతో చిత్రాలను థియేటర్లలో విడుదలైన పది వారాల తర్వాత ఓటీటీకి ఇవ్వాలి. లో బడ్జెట్ సినిమాలను నాలుగు వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేసుకోవచ్చు. సుమారు ఆరు కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో రూపొందిన సినిమాలపై ఫెడరేషన్‌తో చర్చించాక నిర్ణయం తీసుకోవాలి.
- థియేటర్లలో సినిమా ప్రదర్శనకు వీపీఎఫ్ (VPF - వర్చువల్ ప్రింట్ ఫీజు) ఛార్జీలు ఎగ్జిబిటర్లు చెల్లించాలి.
- థియేటర్లలో టికెట్ ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండాలని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ (Telangana Film Chamber) ప్రతిపాదించింది. సిటీలు, టౌన్లలో సాధారణ థియేటర్లు, సి - క్లాస్ సెంటర్లలో టికెట్ ధర రూ. 100, రూ. 70 (జీఎస్టీతో కలిపి) ఉండాలని పేర్కొంది. మల్టీప్లెక్స్‌లలో జీఎస్టీతో కలిపి రూ. 125 ఉండొచ్చని తెలిపింది. అగ్ర హీరోల సినిమాలు మినహాయిస్తే... మీడియం బడ్జెట్ / హీరో సినిమాలకు సిటీలు, టౌన్లలో జీఎస్టీ కాకుండా రూ. 100 ఉండాలని, సి - సెంటర్లలో అయితే జీఎస్టీతో కలిసి రూ. 100 ఉండాలని, మల్టీప్లెక్స్‌లలో జీఎస్టీతో కలిపి గరిష్టంగా 150 రూపాయలు మాత్రమే ఉండాలని ప్రతిపాదించారు.
- ఇటీవల కాలంలో ప్రతి సినిమాకూ నిర్మాణ వ్యయం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రతి సినిమా యూనిట్ సభ్యులు, ముఖ్యంగా నిర్మాతలు ఛాంబర్ & కౌన్సిల్ నియమ నిబంధనలను పాటించాలి. బడ్జెట్ పెంచుకోవడానికి ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మండలితో చరించాలి. ఆ తర్వాతే నిర్మాణ తీసుకోవాలి.
- హీరోలు, సాంకేతిక నిపుణుల పారితోషికం, పని వేళల విషయంలో నిర్మాతల ఆలోచనలు, అభిప్రాయాల మేరకు ఛాంబర్ / కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకుంటుంది. ఫైటర్స్ యూనియన్, ఫెడరేషన్ సమస్యల గురించి ఛాంబర్, కౌన్సిల్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటారు.
- సినిమా నిర్మాణంలో మేనేజర్ల పాత్రపై కూడా నిర్మాతల మండలిలో చర్చ జరిగింది. నిర్మాతలను తప్పుదోవ పట్టిస్తున్న మేనేజర్లు, కో - ఆర్డినేటర్ల వ్యవస్థను రద్దు చేయాలని మండలిలో నిర్ణయించారు.
Also Read : రేప్ చేస్తామన్నారు, చంపేస్తామన్నారు! రణ్‌వీర్‌ను సపోర్ట్ చేయడానికి నన్ను లాగడం ఎందుకు? - ఉర్ఫీ జావేద్
- సినిమాకు పని చేసే ప్రతి ఒక్కరూ టైమ్ పంక్చువాలిటీ పాటించాలని... అప్పుడు ఎక్కువ షూటింగ్ డేస్ అవసరం లేకుండా అనుకున్న సమయానికి సినిమా కంప్లీట్ అవుతాయి. అసిస్టెంట్లకు హోటల్ రూమ్స్, పేమెంట్స్, ఇతర సౌకర్యాలు కావాలని నటీనటులు ఎవరూ డిమాండ్ చేయటానికి వీలు లేదు. రెమ్యూనరేషన్స్ నుంచి అసిస్టెంట్లకు పే చేసుకోవాలి.
Also Read : నేను వైఎస్సార్ అభిమానినే కానీ కమ్మ, కాపులను తిట్టలేదు - నితిన్ దర్శకుడు