తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన సినీ సెలబ్రెటీలు ఇప్పుడు కేసుల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. మొన్నటికి మొన్న 11 మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు ఇప్పుడు మరో 25 మందిపై కేసులు రిజిస్టర్ చేశారు. వీరిలో చాలా మంది అగ్రనటులు ఉన్నారు. కేసులు నమోదు అయిన వారి వివరాలు ఇవే 
రానా దగ్గుబాటి
విజయ్‌ దేవరకొండ
ప్రకాశ్‌రాజ్‌, 
మంచులక్ష్మియ 
నిధి అగర్వాల్
యాంకర్ శ్రీముఖి
వర్షిణి
సిరి హన్మంతు
అనన్య నాగళ్ల
ఇలా 25 మందిని గుర్తించి పోలీసులు కేసులు పెట్టారు. వీళ్లను విచారణకు రావాల్సిందిగా మియాపూర్‌ పోలీసులు పిలుస్తున్నారు.