Brahmanandam Speech at Pelli Kani Prasad Pre Release Event: ‘హాస్య బ్రహ్మ’ బ్రహ్మానందం ఒక్కోసారి మాట్లాడుతుంది వింటే... విశ్వ రహస్యం చెబుతున్నాడేమో అనిపిస్తుంది. ఆ విషయాన్ని కూడా కామెడీ కోణంలో చెప్పడంలో ఆయనే దిట్ట. ఇటీవల ఆయన రచించిన బుక్‌లో, ‘బ్రహ్మా ఆనందం’ సినిమా ప్రమోషన్స్ నిమిత్తం ఆయన పాల్గొన్న పాడ్‌ క్యాస్ట్ ఇంటర్వ్యూలో ఎన్నో జీవిత సత్యాలను తెలిపారు. తాజాగా ఆయన కమెడియన్ సప్తగిరి హీరోగా నటించిన ‘పెళ్లి కాని ప్రసాద్’ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కమెడియన్ల గురించి ఆయన చెప్పిన ఒకే ఒక్క మాట విన్న వారంతా.. వారి ఫ్యాంట్ జేబుల్లో రెండు చేతులు పట్టుకుని ఎటు వెళ్లిపోతున్నారో వారికే తెలియడం లేదంటే.. నమ్మాలి మరి. అసలు ఇంతకీ బ్రహ్మానందం ఏం చెప్పారంటే..


కమెడియన్ కమ్ హీరో సప్తగిరిని ఉద్దేశించి బ్రహ్మానందం మాట్లాడుతూ.. ‘‘ఒక 15, 20 రోజుల నుంచి సప్తగిరి ఎంత శ్రమ పడుతున్నాడో, ఎంత కష్టపడుతున్నాడో.. ఆల్మోస్ట్, ఒక్క మాటలో చెప్పాలంటే, ఇతను బాధపడ్డా సరే.. ఏకాకిగా తిరిగాడు. ప్రతివాడి దగ్గరికి వెళ్లాడు. ప్రతివాడిని పట్టుకున్నాడు. ఎంత మంది అన్నలు ఉన్నారురా నీకు అని అడిగాను. మా రాజు అన్న సినిమా చేస్తానన్నాడు సార్ అన్నాడు. మా మారుతి అన్న వస్తానన్నాడు సార్ అని అంటాడు. డార్లింగ్ శీనున్న రాస్తానన్నాడు సార్ అంటాడు. ఇలా అందరినీ అన్నలే అని చెబుతున్నాడు.


Also Readటెస్లా కారుకు 'మెగాస్టార్'... టెక్సాస్‌లో చిరు వీరాభిమాని డాక్టర్ ఇస్మాయిల్ పెనుకొండ రేర్ ఫీట్


ఇలా, తనకి తాను.. అందరితో కలిసిపోయి, తన ప్రతిభను ప్రదర్శించి.. కనిపించినా, కనిపించని దేవుళ్లందరికీ మొక్కుకున్నాడు. ఎందుకంటే, ఈ సినిమా సక్సెస్ అయి, నన్ను ఆశీర్వదిస్తే.. సినిమాను నమ్ముకుని వచ్చినందుకు నేను హాయిగా నాలుగు మెతుకులు తిని బ్రతుకుతాను అన్నా.. అని నాతో స్వయంగా అన్నాడు. నిజంగా ఇవి అతను నాతో చెప్పిన మాటలు. ఈ మాటలు నేను చెప్పాలి. అందుకోసమే ఈ సినిమా ప్రమోషన్ కోసం వచ్చాను. అంతే తప్పితే.. ఈ సినిమాతో నాకు ఎటువంటి సంబంధం లేదు.. నాకు ఎలాంటి రెమ్యూనరేషన్ కూడా ఇవ్వలేదు.


అయినా సరే, ఈ వేడుకకు ఎందుకు వచ్చానంటే.. ఒక హాస్యనటుడు ఎప్పుడూ ఒంటరి అవ్వకూడదు. ఎవరైనా ఒంటరిగా ఉండవచ్చు. ఎందుకంటే, తెల్లవారి లేస్తే.. మిగతా హీరోలు, హీరోయిన్లు, విలన్లు ఎలా ఉంటారో నాకు తెలియదు.. కమెడియన్స్ మాత్రం ప్రేక్షకులను ఎలా నవ్వించాలి? ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ మార్చితే నవ్వుతారేమోనని ఆశ. అలా అనేక రకాలైన ఎక్స్‌ప్రెషన్స్ పెట్టి, ప్రేక్షకులను నవ్వించి, వారి ఆశీస్సులను పొంది, బతుకు తెరువు సాధించాలనుకునే వారిలో హాస్యనటుడు ఒకరు. కాబట్టి హాస్యనటుడు ఎప్పుడూ ఒంటరివాడు కాకూడదు. వాడికి అందరూ ఉండాలి. ఎందుకంటే, అతడి ప్రవృత్తి, వృత్తి ఏంటంటే అందరినీ నవ్వించడం. అటువంటి పవిత్రమైన పనులను చేసే వారిని హాస్యనటులు అంటారు కాబట్టి.. ‘మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, హాస్యనటుడోభవ’’ అని బ్రహ్మానందం చెప్పుకొచ్చారు. 


Also Readఆ రహస్యాలను ప్రాణం కన్నా జాగ్రత్తగా కాపాడుకోవాలి... సైకోమెట్రీ సబ్జెక్ట్‌తో నవదీప్ మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్