తెలంగాణలో సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లు అందరూ కలిసి మంగళవారం రాత్రి భాగ్య నగరంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. తమకు పర్సంటేజ్ ఇవ్వవల్సిందేనని, ఇక మీదట రెంటల్ పద్ధతికి అంగీకరించేది లేదని తెలిపారు. అదొక్కటే కాదు... ఇతర అంశాల్లోనూ తమ వైఖరిని స్పష్టంగా వెల్లడించారు. వాటిలో ముఖ్యమైనది... టికెట్ రేట్లు.
టికెట్ రేట్లు పెంచేది లేదు...ప్రేక్షకుల మీద భారం మోపేది లేదు!తెలంగాణలో టికెట్ రేట్స్ పెంపు మీద గత కొన్ని రోజులుగా భిన్నాభిప్రాయాలు వినపడుతున్నాయి. టికెట్ రేటు పెంచుకోవడానికి వీలుగా ప్రభుత్వం అనుమతి ఇచ్చినా... కోర్టులో కొందరు పిటీషన్లు వేయడం నిర్మాతలకు పెద్ద తలనొప్పి వ్యవహారంగా మారింది. టికెట్ రేటు పెంచడం సరైన నిర్ణయమా? కాదా? అనేది పక్కన పెడితే... ఇప్పుడు తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ తరఫున ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు సోదరుడు - నిర్మాత కమ్ ఎగ్జిబిటర్ శిరీష్ టికెట్ రేట్లు పెంచేందుకు ససేమిరా ఒప్పుకోమని చెప్పారు. ప్రభుత్వం నుంచి అనుమతి లభించినా... తాము మాత్రం తమ థియేటర్లలో పెంచేది లేదని, ప్రేక్షకుల మీద భారం మోపేది లేదని పేర్కొన్నారు. దీని వల్ల ముందుగా నష్టపోయే సినిమా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది'.
'పెద్ది' వసూళ్లకు పెద్ద గండి...సాధారణ టికెట్ రేట్లతో రికార్డులు కష్టమే!ఇప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో బాల్కనీ టికెట్ రేటు 200 లోపే ఉంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే... 175 రూపాయలు. ఆన్ లైన్ టికెటింగ్ యాప్స్ అయిన పేటీఎమ్, బుక్ మై షోలో బుక్ చేస్తే 200 అవుతుంది. బాల్కనీ తర్వాత వంద రూపాయలు, నేల టికెట్టు 50 రూపాయలు ఉంది. సినిమా విడుదలైనప్పటి నుంచి మొదటి వారం లేదా పది రోజులు టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి లభిస్తే ఆ రేటు 200 నుంచి 400 లేదా 500 వరకు వెళుతోంది. బెనిఫిట్ షో రేట్లు అయితే 1000 నుంచి 2000 వరకు ఉంటున్నాయి. ఇప్పుడు టికెట్ రేట్లు పెంచమని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ స్పష్టంగా చెప్పడం వల్ల మొదటగా నష్టపోయే సినిమా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది'యే.
Also Read: Mouni Roy Divorce - డబ్బులు వాడుకున్నాడు... మోసం చేశాడు... మౌనీ రాయ్ విడాకుల వెనుక కారణాలు అవేనా?
జూన్ 4న 'పెద్ది' విడుదల అవుతోంది. సినిమాకు కావాల్సిన బజ్ ఆల్రెడీ విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలు తీసుకు వచ్చాయి. అభిమానులు, ప్రేక్షకులు కొందరు నాలుగు వందలు అయినా టికెట్ పెట్టి సినిమా మొదటి వారం సినిమా చూసేందుకు రెడీ. ఆల్రెడీ టికెట్ రేట్లు గురించి ప్రభుత్వంతో చిత్ర నిర్మాత వెంకట సతీష్ కిలారు మాట్లాడినట్టు తెలిసింది. జీవో వచ్చినా సింగిల్ స్క్రీన్ థియేటర్లు టికెట్ రేట్లు పెంచి సినిమా ప్రదర్శించేందుకు ససేమిరా ఒప్పుకోమని చెబితే నిర్మాతకు వచ్చే వసూళ్ళకు పెద్ద గండి పడుతుంది. మైత్రి డిస్ట్రిబ్యూషన్, సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్స్ మధ్య కొన్ని రోజులుగా ఇష్యూలు ఉన్నాయి. ఇప్పుడు అవి 'పెద్ది' మీద ఎఫెక్ట్ చూపించేలా ఉన్నాయి.
Also Read: Nani Paradise - పుకార్లకు చెక్ పెట్టిన ప్యారడైజ్ టీమ్... గట్టిగా ఇచ్చిపడేసిన నాని & కో
