Tanikella Bharani Wishes To Mutton Soup Movie: యంగ్ హీరో రమణ్, ఫోనిక్స్ మూవీ ఫేం వర్షా విశ్వనాథ్ జంటగా నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ 'మటన్ సూప్'. ఈ మూవీలో 'హర హర శంకర' పాటను ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి మంగళవారం రిలీజ్ చేశారు. ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన మూవీ సక్సెస్ కావాలని ఆకాంక్షించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్, మోషన్ పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి.
రియల్ లైఫ్ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీకి 'విట్‌నెస్ ది రియల్ క్రైమ్' అనేది ట్యాగ్ లైన్. రామకృష్ణ వట్టికూటి ఈ మూవీతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తుండగా... అలుక్కా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్స్, భవిష్య విహార్ చిత్రాలు (BVC) బ్యానర్లపై మల్లిఖార్జున ఎలికా (గోపాల్), అరుణ్ చంద్ర వట్టికూటి, రామకృష్ణ సనపల నిర్మించారు. ఈ మూవీలో రమణ్, వర్షాతో పాటు జెమినీ సురేష్, గోవింద్ శ్రీనివాస్, శివరాజ్, ఎస్ఆర్‌కే, చరణ్, కిరణ్, గోపాల్ మహర్షి, సునీత మనోహర్, మాస్టర్ విహార్, కిరణ్ మేడసాని తదితరులు కీలక పాత్రలు పోషించారు.
'మూవీ సక్సెస్ కావాలి'
'మటన్ సూప్' మూవీ గొప్ప సక్సెస్ కావాలని ఆ పరమేశ్వున్ని ప్రార్థిస్తున్నట్లు తనికెళ్ల భరణి తెలిపారు. 'ఆ విఘ్నేశ్వరుడి దయతో ఏ విఘ్నాలు లేకుండా ‘మటన్ సూప్’చిత్రం పెద్ద విజయం సాధించాలి. ప్రస్తుతం ఇండస్ట్రీలోకి కొత్త రక్తం వస్తోంది. 40 ఏళ్లుగా ఈ ఇండస్ట్రీలో ఉన్నాను. ఓ సినిమా తీయాలంటే ఎంత కష్టపడాల్సి వస్తుందో నాకు తెలుసు. ఈ మూవీ తీసిన వారి, చూసిన వారి జీవితాలు మారిపోవాలి. ‘హర హర శంకర’ పాటలో సమాజంలో జరుగుతున్న ఘోరాల్ని చూపించారు. ‘మటన్ సూప్’ టీం పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలం రావాలి. ఈ మూవీ విజయవంతం అవ్వాలని ఆ పరమేశ్వరుడ్ని ప్రార్థిస్తున్నాను' అని అన్నారు.
Also Read: 'బాహుబలి' మళ్లీ వచ్చేశాడు - రెండు మూవీస్ ఒకే మూవీగా... 'బాహుబలి: ది ఎపిక్' టీజర్ చూశారా?
సెప్టెంబర్‌లో రిలీజ్
'హర హర శంకర' పాట రిలీజ్ చేసిన తనికెళ్ల భరణికి కృతజ్ఞతలు తెలిపారు డైరెక్టర్ రామచంద్ర. 'ఈ జర్నీలో నాకు తోడుగా నిలిచిన నిర్మాతలకు ధన్యవాదాలు. త్వరలోనే మా చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్లు ఇస్తాం. సెప్టెంబర్‌లో మూవీని విడుదల చేసేదుకు ప్రయత్నిస్తున్నాం.' అని తెలిపారు.
ఈ మూవీలో ప్రతీ సీన్ జీవితంలో జరిగినట్లే అనిపిస్తుందని హీరో రమణ్ తెలిపారు. 'మా పాటను విడుదల చేసిన తనికెళ్ల భరణి గారికి థాంక్స్. మేమంతా ఎంతో కష్టపడి ఈ మూవీని తీశాం. ఈ మూవీని అందరూ చూసి సక్సెస్ చేయండి.' అని కోరారు. తనకు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్ చెప్పారు నటి సునీత మనోహర్. మూవీ కచ్చితంగా సక్సెస్ అవుతుందన్నారు.
మటన్ సూప్ మూవీ టీం - బ్యానర్స్ : అలుక్కా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్స్, భవిష్య విహార్ చిత్రాలు (BVC), సమర్పణ : రామకృష్ణ వట్టికూటి
దర్శకుడు : రామచంద్ర వట్టికూటి, నిర్మాత : మల్లిఖార్జున ఎలికా (గోపాల్), అరుణ్ చంద్ర వట్టికూటి, రామకృష్ణ సనపల, కెమెరామెన్ : భరద్వాజ్, ఫణింద్ర, మ్యూజిక్ : వెంకీ వీణ, ఎడిటింగ్ : లోకేష్ కడలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పర్వతనేని రాంబాబు, కో డైరెక్టర్ : గోపాల్ మహర్షి, పి.ఆర్.ఒ : మోహన్ తుమ్మల.