Simha Koduri's Bhaag Saale OTT Release Date On Etvwin: ఆస్కార్ విన్నర్ కీరవాణి కుమారుడు శ్రీసింహ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ కామెడీ డ్రామా 'భాగ్ సాలే'. దాదాపు రెండేళ్ల తర్వాత ఈ మూవీ మరో ఓటీటీలోకి స్ట్రీమింగ్ కాబోతోంది. ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వం వహించిన ఈ మూవీ 2023లో రిలీజ్ కాగా... బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది.
ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓ ఫేమస్ డైమండ్ రింగ్ చుట్టూ సాగే ఈ స్టోరీ ఇప్పటికే ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా మరో ఓటీటీ 'ఈటీవీ విన్'లోనూ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ నెల 28 నుంచి మూవీ అందుబాటులోకి వస్తుందంటూ సోషల్ మీడియా వేదికగా ఈటీవీ విన్ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. 'ముందుగా చూడండి. ముందుగా నవ్వండి' అంటూ పేర్కొంది.
Also Read: 'బాహుబలి' మళ్లీ వచ్చేశాడు - రెండు మూవీస్ ఒకే మూవీగా... 'బాహుబలి: ది ఎపిక్' టీజర్ చూశారా?
ఈ మూవీలో శ్రీసింహా సరసన నీహా సోలంకి హీరోయిన్‌గా నటించారు. వీరితో పాటే జాన్ విజయ్, రాజీవ్ కనకాల, నందిని రాయ్, హర్ష చెముడు తదితరులు కీలక పాత్రలు పోషించారు. బిగ్ బెన్ సినిమాస్, సినీవాలీ మూవీస్‌తో కలిసి వేదాన్స్ క్రియేటివ్ వర్క్స్ మూవీని నిర్మించింది. అర్జున్ దాస్యం, యశ్ రంగినేని, సింగనమల కల్యాణ్ నిర్మాతలుగా వ్యవహరించారు.
స్టోరీ ఏంటంటే?
అర్జున్ (శ్రీసింహా) ఓ స్టార్ హోటల్‌లో షెఫ్‌గా పని చేస్తూనే ఓ పెద్ద రెస్టారెంట్‌కు ఓనర్ కావాలని కలలు కంటుంటాడు. తాను రిచ్ పర్సెన్ అని చెప్పి మాయ (నేహ సోలంకి)ని లవ్‌లోకి దింపుతాడు. తన తండ్రి (రాజీవ్ కనకాల)కి ఎంతో ఇష్టమైన సొంతింటిని కూడా అమ్మించి ఆ డబ్బులతో రెస్టారెంట్ పెట్టాలని అనుకుంటాడు. ఇంతలో మాయ ఇంటిపై శామూల్ (జాన్ విజయ్) అనే ఓ పెద్ద డాన్ దాడి చేసి తనకు డైమండ్ రింగ్ ఇవ్వాలంటూ ఆమె తండ్రిని కిడ్నాప్ చేస్తాడు. అసలు ఆ రింగ్ ఏంటి? దాని వెనుక స్టోరీ ఏంటి? మాయ తండ్రిని అర్జున్ కాపాడాడా? తన రెస్టారెంట్ కల నెరవేర్చుకున్నాడా? అర్జున్ స్టేటస్ మాయకు తెలుస్తుందా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.