Actress Vijayalakshmi Sensational Video: ప్రముఖ తమిళ నటి విజయ లక్ష్మి షాకింగ్ వీడియోను విడుదల చేసింది. తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు ఆ వీడియోలో వెల్లడించింది. తనకు జరిగిన అన్యాయంపై ఎవరూ స్పందించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది. తన ఆత్మహత్యకు గల కారణాలను వీడియోలో వివరించింది.
ఆత్మహత్య చేసుకోబోతున్నా- విజయలక్ష్మి
సినిమా పరిశ్రమ అనేది రంగుల ప్రపంచం. ఎవరిని.. ఎప్పుడు.. ఎలా మార్చుతుందో? ఎవరికీ తెలియదు. సినిమా పరిశ్రమలోకి వచ్చిన కొందరు తక్కువ సమయంలోనే స్టార్లు మారిపోతుంటారు. మరికొంత మంది ఏళ్ల తరబడి కష్టపడ్డా పెద్దగా సక్సెస్ కాలేరు. వెండితెర మీద కనిపించే రంగులు నిజ జీవితంలో ఉండవని ఎంతో మంది విషయంలో నిర్ధారణ అయ్యింది. ఆర్థిక పరిస్థితులు, కమిట్మెంట్స్ కారణంగా జీవితాలు కోల్పోయిన సినీ తారలు ఎంతో మంది ఉన్నారు. తాజాగా అలాంటి పరిస్థితులను ఎదుర్కొని ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు నటి విజయ లక్ష్మి విడుదల చేసిన వీడియో తమిళ సినీ పరిశ్రమలో సంచలనంగా మారింది.
గత కొంతకాలంగా సీమాన్‌పై విజయలక్ష్మి ఆరోపణలు
తమిళనాడు నామ్ తమిళర్ కట్చి పార్టీ అధినేత, నటుడు, దర్శకుడు సీమాన్‌పై గత కొంతకాలంగా నటి విజయలక్ష్మి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. సీమాన్ తనను రహస్యంగా పెళ్లి చేసుకుని మోసం చేశాడని, తనను శారీరకంగా వాడుకుని వదిలేశాడని సంచలన వ్యాఖ్యలు చేసింది. సీమాన్ తనను మోసం చేశాడని ఆరోపిస్తూ ఇప్పటికే ఆత్మహత్యా యత్నం చేసింది. సోషల్ మీడియా లైవ్ లోనే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. వెంటనే ఆమెను హాస్పిటల్ కు తరలించడంతో బతికింది.
మరోసారి సంచలన వీడియో విడుదల
తాజా మరోసారి ఓ సంచలన వీడియోను విడుదల చేసింది. ఇదే తన చివరి వీడియో అంటూ ఆందరినీ షాక్‌కు గురి చేసింది. ఫిబ్రవరి 29న ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో తనతో సీమాన్ మాట్లాడాలని కోరింది. అయితే, ఆమె మాటలను సీమాన్ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో మరో వీడియోను పోస్టు చేసింది. “ఫిబ్రవరి 29న నేను ఓ వీడియోను షేర్ చేశాను. సీమాన్ ను నాతో మాట్లాడాలని, ఆయన నాతో కలిసి ఉండాలని కోరాను. కానీ, ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదు. నువ్వు లేకుంటే చనిపోతానని చెప్పినా పట్టించుకోలేదు. నన్ను రహస్యంగా పెళ్లి చేసుకుని నా జీవితాన్ని నాశనం చేశాడు. శారీరక అవసరాలు తీర్చుకుని ఇప్పుడు పట్టించుకోవడం లేదు. న్యాయం కోసం ప్రయత్నించినా ఎవరూ పట్టించుకోవడం లేదు. బతకడం కంటే చావడం మంచిది అనుకుంటున్నాను. ఇదే నా చివరి వీడియో” అంటూ వీడియో రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దక్షిణాది నటిగా మంచి గుర్తింపు
తమిళ సినిమా పరిశ్రమలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది విజయలక్ష్మి. 'నాగమండలం' చిత్రంతో 1997లో సినీ కెరీర్ ను మొదలు పెట్టింది. ఆ తర్వాత పలు సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. తెలుగులోనూ పలు సినిమాలు చేసింది. ‘హనుమాన్ జంక్షన్’ సినిమాలో జగపతిబాబు, అర్జున్ చెల్లెలిగా నటించి ఆకట్టుకుంది. తెలుగు, తమిళ, మలయాళంలో మొత్తం 40 సినిమాలకు పైగా నటించి గుర్తింపు తెచ్చుకుంది.
Read Also: అల్లు అర్జున్ - స్నేహ రెడ్డిల పెళ్లి బంధానికి 13 ఏళ్లు, వీరి లవ్ స్టోరీ మీకు తెలుసా?