‘గుడ్ నైట్’ మూవీలో ఎంతో అమాయకంగా కనిపించిన ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లి చేసుకునందని తెలుస్తోంది. తాజాగా ఆమె ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఆమె అభిమానులు షాకవుతున్నారు. అప్పుడే ఆమె పెళ్లి చేసుకుంటుందా అని ఆశ్చర్యపోతున్నారు. అయితే, దీనిపై ఆమె అధికారికంగా ఎలాంటి ప్రకటన చెయ్యలేదు.


ఊటీలో ఎంగేజ్‌మెంట్..


కేవలం హీరోయిన్‌గా రెండు సినిమాలు మాత్రమే అనుభవం ఉన్న తమిళ నటి మీథా రఘునాథ్. ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు.. ఆఫ్ స్క్రీన్ కూడా సింపుల్‌గా కనిపించే ఈ ముద్దుగుమ్మకు ఎంగేజ్‌మెంట్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతే కాకుండా ఈ ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన రెండు ఫోటోలు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే మీథా మాత్రం తన ఎంగేజ్‌మెంట్ గురించి ఫ్యాన్స్‌కు ఏ మాత్రం హింట్ ఇవ్వకపోవడంతో అసలు ఇది నిజమా, కాదా అని తన ఫ్యాన్స్ అయోమయంలో పడ్డారు. మీథా సొంతూరు అయిన ఊటీలో ఎంగేజ్‌మెంట్ జరిగిందని, తనకు కాబోయే భర్త కూడా సినీ పరిశ్రమకు చెందినవాడే అని వార్తలు వినిపిస్తున్నాయి.




సింపుల్ లుక్స్‌తో యూత్‌ను ఫిదా..
ముందుగా 2022లో ‘ముదల్ నీ ముడివుమ్ నీ’ అనే సినిమాతో కోలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమయ్యింది మీథా రఘునాథ్. అందరూ కొత్త నటీనటులతో, కొత్త దర్శకుడితో తెరకెక్కిన ఈ చిత్రం.. థియేటర్లలో విడులదయినప్పుడు కొంతమంది ప్రేక్షకులకు మాత్రమే రీచ్ అయ్యింది. కానీ ఓటీటీలో విడుదలయిన తర్వాత కేవలం తమిళ ప్రేక్షకులు మాత్రమే కాదు.. సౌత్ మూవీ లవర్స్ అంతా ఈ చిత్రాన్ని ఆదరించడం మొదలుపెట్టారు. సింపుల్ స్టోరీతో, నేచురల్ యాక్టింగ్‌తో ‘ముదల్ నీ ముడివుమ్ నీ’ ప్రేక్షకులను కట్టిపడేసింది. దీంతో మొదటి సినిమాతోనే ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకుంది మీథా.


‘గుడ్ నైట్’తో పాపులారిటీ..
‘ముదల్ నీ ముడివుమ్ నీ’ విడుదలయిన సంవత్సరం తర్వాత ‘గుడ్ నైట్’ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను పలకరించింది మీథా రఘునాథ్. మొదటి సినిమాలోలాగానే ఇందులో కూడా ఒక పక్కింటామ్మాయి పాత్రలో సింపుల్‌గా కనిపించింది. ‘గుడ్ నైట్’ కోసం ‘జై భీమ్’ సినిమాలో తన యాక్టింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచిన మణికందన్‌తో జోడీకట్టింది మీథా. ఇటీవల హాట్‌స్టార్‌లో రిలీజ్ అయిన ఈ చిత్రం క్లీన్ హిట్‌ను సాధించింది. అంతే కాకుండా భార్య అంటే ఇలా ఉండాలి, చాలామందికి ఇలాంటి భార్య కావాలనే కోరిక ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో మీథా తెగ పాపులర్ అయిపోయింది. ప్రస్తుతం మీథా తరువాతి ప్రాజెక్ట్స్ గురించి క్లారిటీ లేదు. ఇదే సమయంలో తన ఎంగేజ్‌మెంట్ అంటూ వచ్చిన వార్తలు.. తన ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేస్తున్నాయి. కానీ తనంతట తానుగా ప్రకటించే వరకు ఈ వార్తలను నమ్మలేమని తన ఫ్యాన్స్ కొందరు భావిస్తున్నారు.


Also Read: 'సలార్' విడుదలకు వారం ముందు - 'బేబీ' హీరో విరాజ్ అశ్విన్ కొత్త సినిమా!


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply