Baby movie fame Viraj Ashwin new movie: 'బేబీ'తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన యంగ్ హీరో విరాజ్ అశ్విన్. దాని కంటే ముందు 'మాయా పేటిక', 'థాంక్యూ బ్రదర్', 'అనగనగా ఓ ప్రేమకథ' సినిమాలు చేశారు. ఆయన నటించిన షార్ట్ ఫిల్మ్ 'మనసానమః' పలు చలన చిత్రోత్సవాల్లో అవార్డులు అందుకుంది. అయితే... 'బేబీ' ఆయనకు భారీ విజయం అందించింది. ఇప్పుడు ఆయన మరో సినిమాతో ఈ ఏడాది ఆఖరున థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతున్నారు.
'సలార్' విడుదల కంటే వారం ముందు...
విరాజ్ అశ్విన్ 'జోరుగా హుషారుగా' విడుదల!
Joruga Husharuga Release Date: విరాజ్ అశ్విన్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా 'జోరుగా హుషారుగా'. ఇందులో తెలుగు అమ్మాయి పూజిత పొన్నాడ కథానాయిక. అను ప్రసాద్ దర్శకత్వంలో శిఖర అండ్ అక్షర ఆర్ట్స్ ఎల్ఎల్‌పీ పతాకంపై నిరీష్ తిరువిధుల నిర్మిస్తున్నారు.
యూత్‌ఫుల్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న 'జోరుగా హుషారుగా' చిత్రాన్ని డిసెంబరు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు చిత్ర నిర్మాత నిరీష్ తిరువిధుల అనౌన్స్ చేశారు. అంటే... పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న 'సలార్' విడుదల కంటే ఒక్క వారం ముందు ఈ సినిమా థియేటర్లలోకి వస్తుందన్నమాట! ప్రభాస్ సినిమా డిసెంబర్ 22న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.
Also Read: ఆదికేశవ రివ్యూ: మెగా మేనల్లుడి ఊర మాస్ యాక్షన్ - వైష్ణవ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొత్త విరాజ్ అశ్విన్ కనిపిస్తారు!
'జోరుగా హుషారుగా' సినిమా గురించి నిర్మాత నిరీష్ తిరువిధుల మాట్లాడుతూ ''మా సినిమా టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. చిన్నారుల నుంచి పెద్దల వరకు... సినిమాలో వినోదం అందరినీ ఆకట్టుకుంటుంది. మంచి సినిమా చూశామనే అనుభూతికి లోనవుతారు. ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్ గారి సహకారంతో డిసెంబరు 15న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం'' అని అన్నారు.
Also Read: 'కోట బొమ్మాళి'లో స్ట్రాంగ్ పొలిటికల్ సెటైర్స్, ఏపీలో వ్యవస్థే టార్గెట్ - ట్విట్టర్ రివ్యూలు చూశారా?
దర్శకుడు అను ప్రసాద్ మాట్లాడుతూ... ''ఈ సినిమాలో విరాజ్ అశ్విన్‌ను కొత్తగా చూస్తారు. ఆయన పాత్రలో మంచి ఎనర్జీ వుంటుంది. 'బేబి'తో యువతకు దగ్గరైన ఆయన... ఈ సినిమాతో మరింత చేరువ అవుతాడు. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులు ప్రతి ఒక్కరికి సినిమా తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉంది'' అని అన్నారు. విరాజ్ అశ్విన్, పూజిత పొన్నాడ జంటగా నటిస్తున్న 'జోరుగా హుషారుగా' సినిమాలో సాయి కుమార్, రోహిణి, మధునందన్, సిరి హనుమంతు, సోనూ ఠాకూర్, బ్రహ్మజీ, 'చమ్మక్' చంద్ర, 'క్రేజీ కన్నా' ఇతర తారాగణం. ఈ చిత్రానికి సంగీతం: ప్రణీత్ మ్యూజిక్, కూర్పు: మార్తాండ్ కె వెంకటేష్.