Tamannaah - Bholaa Shankar : 'భోళా శంకర్'తో ఆ లోటు తీరింది - తమన్నా ఇంటర్వ్యూ 

చిరంజీవికి జోడీగా తమన్నా నటించిన తాజా సినిమా 'భోళా శంకర్'. ఆగస్టు 11న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో తమన్నా చెప్పిన సంగతులు...

Continues below advertisement

మెగాస్టార్ చిరంజీవికి జోడీగా తమన్నా భాటియా (Tamannaah Bhatia) నటించిన తాజా సినిమా 'భోళా శంకర్' (Bholaa Shankar Movie). మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దానికి ఒక్క రోజు ముందు ఆగస్టు 10న రజనీకాంత్ 'జైలర్' (Jailer Movie) విడుదల అవుతోంది. బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలతో ఆగస్టు రెండో వారంలో థియేటర్లలో తమన్నా సందడి చేయడం గ్యారెంటీ. ఈ సందర్భంగా తమన్నా చెప్పిన విశేషాలు ఆమె మాటల్లో...

Continues below advertisement

''మెగాస్టార్ చిరంజీవి గారు, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు... చిత్రసీమలో ఇద్దరు పెద్ద స్టార్లతో ఒకేసారి సినిమాలు చేయడం సంతోషంగా ఉంది. ఇదంతా ఓ కలలా ఉంది. చాలా ఆనందంగా ఉంది. 'భోళా శంకర్', 'జైలర్'... ఈ రెండు చిత్రాలు అన్ని భాషల్లో విడుదల అవుతున్నాయి''. 

'భోళా శంకర్'తో ఆ లోటు తీరింది!
''సైరా నరసింహారెడ్డి' సినిమాలో చిరంజీవిగారితో డాన్స్ చేసే అవకాశం రాలేదు. ఆ లోటు 'భోళా శంకర్'తో ఆ లోటు తీరింది. ఆ పాటకు 'మిల్కీ బ్యూటీ' అని పేరు పెట్టారు. రియల్లీ క్యూట్ కదా! ఇప్పుడు వాడుతున్న డాన్స్ స్టయిల్స్ చిరంజీవి గారి దగ్గర నుంచి వచ్చాయి. ఆయనతో డ్యాన్స్ చేసే అవకాశం రావడం చాలా హ్యాపీగా ఉంది. ఇది నా అదృష్టం. 'మిల్కీ బ్యూటీ...' రొమాంటిక్ మెలోడీ. ఓ హుక్ స్టెప్, గ్రేస్ ఫుల్ మూమెంట్స్ ఆ పాటలో ఉన్నాయి''. 

'వేదాళం'తో పోలిస్తే చాలా మార్పులు చేశారు! 
''భోళా శంకర్' సినిమా 'వేదాళం'కు రీమేక్. అయితే... దర్శకుడు మెహర్ రమేష్ గారు చాలా మార్పులు చేశారు. ముఖ్యంగా నా పాత్ర కొత్తగా ఉంటుంది. హ్యూమర్ చాలా యాడ్ చేశారు. 'వేదాళం'లో కథానాయిక పాత్ర ఎక్కువ ఉండదు. దాంతో పోలిస్తే 'భోళా శంకర్'లో నేను చేసిన హీరోయిన్ పాత్ర డిఫరెంట్ గా ఉంటుంది. నాది ఫుల్ లెంత్ రోల్ కూడా! ఇక, 'జైలర్' సినిమాలో నాది చిన్న పాత్ర. అందులో నేను చేసిన 'నువ్ కావాలయ్యా' పాట చాలా మందికి రీచ్ కావడం సంతోషంగా ఉంది''.

Also Read : 'లెట్స్ గెట్ మ్యారీడ్' రివ్యూ : ఎంఎస్‌ ధోనీ నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?

కీర్తీ సురేష్, నేను మంచి స్నేహితులమయ్యాం!
'కాళిదాస్' తర్వాత మళ్ళీ సుశాంత్, నేను నటించిన చిత్రమిది. ఇదొక వండర్ ఫుల్ జర్నీ. ఇందులో మా ఇద్దరివి డిఫరెంట్ రోల్స్. కీర్తి సురేష్ మంచి నటి. ఇంటెన్స్ సన్నివేశాలతో పాటు అన్ని భావోద్వేగాలను సెటిల్డ్ & బ్యాలెన్సింగ్ గా చేస్తుంది. ఈ సినిమాతో కీర్తి సురేష్, నేను మంచి ఫ్రెండ్స్ అయ్యాం. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మాణ విలువలు బావున్నాయి. వాళ్ళు చాలా మంచి నిర్మాతలు. ఎక్కడా రాజీ పడకుండా సినిమాకు కావాల్సింది సమకూర్చారు''. 

Also Read 'దయా' రివ్యూ : జేడీ చక్రవర్తి నటించిన తొలి వెబ్ సిరీస్... సత్యను గుర్తు చేసిన జేడీ!

ప్రస్తుతం తమిళంలో 'అరణం', మలయాళంలో 'బాంద్రా' సినిమాలతో పాటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ కోసం ఓ వెబ్ సిరీస్ చేస్తున్నారు తమన్నా. 

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Continues below advertisement