Tamannaah Bhatia To Headline An Erotic Horror Thriller: హారర్, క్రైమ్, థ్రిల్లర్ కంటెంట్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రీసెంట్‌గా చాలామంది స్టార్ నటీనటులు అలాంటి జానర్లలోనే నటిస్తూ మంచి సక్సెస్ అందుకుంటున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా ఒకప్పుడు ఫ్యామిలీ, లవ్ ఎంటర్‌టైనర్స్‌లో ఎక్కువగా మూవీస్ చేస్తూ తాజాగా రూట్ మార్చారు. హారర్ థ్రిల్లర్ 'ఓదెల 2'లో శివశక్తిగా నటించి మెప్పించారు. 

Continues below advertisement


మరో హారర్ థ్రిల్లర్


తమన్నా మరోసారి హారర్ థ్రిల్లర్ జానర్ మూవీలో నటించనున్నారనే వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్‌లో హిట్ ఫ్రాంచైజీ 'రాగిణి ఎంఎంఎస్'. బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్ నటించిన 'రాగిణి ఎంఎంఎస్ 2' బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. రొమాంటిక్ హారర్ థ్రిల్లర్స్‌గా ఈ ఫ్రాంచైజీని ఏక్తాకపూర్ నిర్మించగా... ఇప్పుడు మూడో భాగంలో తమన్నాను తీసుకోవాలని భావిస్తున్నారట. ఆయన తమన్నాతో ఈ స్టోరీ ఐడియా పంచుకున్నారని... మూవీలో హారర్ ఎలిమెంట్స్ ఆమెకు బాగా నచ్చేసినట్లు తెలుస్తోంది.


Also Read: 'పరదా'కు భారీ షాక్... లక్షల్లో ఓపెనింగ్ డే కలెక్షన్లు - అనుమప కష్టం వృథాయేనా?


రొమాంటిక్ సీన్లలో...


వీటితో పాటే రొమాంటిక్ సీన్లలోనూ నటించేందుకు తమన్నా ఓకే చెప్పినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 'రాగిణి ఎంఎంఎస్ 2'లో సన్నీ లియోన్ రోల్, బేబీ డాల్ సాంగ్ ట్రెండింగ్‌గా నిలిచాయి. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్‌లో తమన్నా నటిస్తుందనే ప్రచారం హాట్ టాపిక్‌గా మారింది. 'రాగిణి ఎంఎంఎస్ 3'లో తమన్నా నటిస్తే అది సంచలనం కావడం ఖాయమని... మిల్కీ బ్యూటీతో నిర్మాతలు ఓ మ్యాజిక్ చేయబోతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఈ ఏడాది చివరి నాటికి సెట్స్‌పైకి వెళ్లే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


సెలక్టివ్‌గా...


ప్రస్తుతం తమన్నా సెలక్టివ్‌గా ప్రాజెక్టులు ఎంచుకుంటున్నారు. 'ఓదెల 2' తర్వాత ఆమె మూవీస్ చేయలేదు. ఎక్కువగా స్టోరీ, రోల్ ప్రాధాన్యం ఉన్న ప్రాజెక్టులనే ఎంచుకుంటున్నారు. గతంలోనూ ఆమె రొమాంటిక్ సీన్లలో నటించారు. 'జైలర్' మూవీలో ఐటమ్ సాంగ్‌తో పాటు 'లవ్ స్టోరీస్ 2'లో నటించారు. ఇప్పుడు రొమాంటిక్ హారర్ థ్రిల్లర్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ అటు మాస్ ఇటు క్లాస్ ఆడియన్స్ మెప్పించే ఛాన్స్ ఉందని... మిల్కీ బ్యూటీని మరోసారి డిఫరెంట్ రోల్‌లో చూడబోతున్నామని ఫ్యాన్స్ అంటున్నారు.