Anupama Parameswaran's Paradha First Day Collection: యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నటించిన లేటెస్ట్ సినిమా 'పరదా'. దీనిపై ఆమె బోలెడు ఆశలు పెట్టుకుంది. ఊరూరు తిరిగి ప్రచారం చేసింది. పరదా ధరించి డిఫరెంట్ పబ్లిసిటీ చేసింది. అయితే ఆవిడ కష్టం వృథా అయ్యిందని బాక్స్ ఆఫీస్ దగ్గర రిజల్ట్ చూస్తే అర్థం అవుతోంది.

ఓపెనింగ్ డే గ్రాస్ 20 లక్షలు!Paradha First Day Gross Collection: తెలుగుతో పాటు మలయాళంలో 'పరదా'ను విడుదల చేశారు. అందుకు కారణం అనుపమతో పాటు సినిమాలో మరో ప్రధాన పాత్ర పోషించిన దర్శన రాజేంద్రన్. వీళ్ళిద్దరూ మలయాళీ అమ్మాయిలు. ఇద్దరికీ మలయాళంలో క్రేజ్ ఉంది. అందుకని, అక్కడ కూడా రిలీజ్ చేశారు. అయితే రెండు భాషల్లోనూ బాక్స్ ఆఫీస్ దగ్గర 'పరదా'కు భారీ షాక్ తగిలింది.

Also Read'పరదా' రివ్యూ: అనుపమ సినిమా హిట్టా? ఫట్టా? 'శుభం' దర్శకుడి కొత్త సినిమా ఎలా ఉందంటే?

తెలుగులో 'పరదా' ఫస్ట్ డే నెట్ కలెక్షన్ 12 లక్షల రూపాయలు మాత్రమే అని ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. మలయాళంలో మరీ తక్కువ వచ్చాయి. అక్కడ నుంచి ఆరు లక్షల రూపాయలు రాబట్టింది. సెన్సార్ సమస్యల వల్ల మలయాళ వెర్షన్ సకాలంలో రిలీజ్ కాలేదు. అక్కడ కలెక్షన్స్ మీద ఆ ఎఫెక్ట్ కూడా ఉంది. మొదటి రోజు ఇండియాలో ఈ సినిమా నెట్ కలెక్షన్ 18 లక్షలు. గ్రాస్ లెక్క వేస్తే మరో రెండు లక్షలు పెరిగింది. సో, ఇండియాలో మొదటి రోజు 'పరదా' గ్రాస్ కలెక్షన్ 20 లక్షల రూపాయలు. మన దేశంలో జనాలు ఆదరించలేదు. పోనీ ఎన్నారైలు ఏమైనా బ్రహ్మరథం పట్టారా? అంటే అదీ లేదు. ఓవర్సీస్ మార్కెట్టులో ఈ సినిమాకు ఆరు వేల డాలర్లు వచ్చాయి. సినిమా బడ్జెట్ ఎంతైనా ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే డిజాస్టర్ కింద లెక్క. రెండో రోజుకు ఈ సినిమా థియేటర్లలో ఉంటుందా? అనే సందేహం నెలకొంది. పలు స్క్రీన్లలో షోలు క్యాన్సిల్ చేస్తున్నారని టాక్.

Also Read: బికినీలో బాలకృష్ణ 'రూలర్', రోహిత్ నారా 'బాణం' హీరోయిన్ వేదిక... లేటెస్ట్ ఫోటోలు చూశారా?

సమంత 'శుభం' తర్వాత తీసిన సినిమా!'పరదా' సినిమాకు ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహించారు. సమంత 'శుభం' తర్వాత ఆయన తీసిన చిత్రమిది. విడుదలకు ముందు సినిమాకు హైప్ ఇవ్వడంలో ప్రీ రిలీజ్ ఈవెంట్లలో ఆయన ఇచ్చే స్పీచ్ లు యూజ్ అవుతున్నాయి. కానీ సినిమాలో విషయం మాత్రం స్పీచ్ స్థాయిలో ఉండటం లేదని విమర్శలు వస్తున్నాయి. మొదటి రోజు 'పరదా'కు మిక్స్డ్ టాక్ వచ్చింది. మెజారిటీ రివ్యూ రైటర్లు సినిమా బాలేదని తేల్చారు. 

'పరదా'లో అనుపమ, దర్శనతో పాటు సీనియర్ హీరోయిన్ సంగీత కీలక పాత్ర పోషించారు. రాగ్ మయూర్, హర్షవర్ధన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, నటకిరీటి డా రాజేంద్ర ప్రసాద్ ఇతర పాత్రలు పోషించారు. ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతం అందించారు.