Sithara Entertainments To Release Kotha Lokah Chapter 1 In Ap Telangana: హలో, చిత్రలహరి వంటి మూవీస్‌తో తెలుగు ఆడియన్స్‌కు దగ్గరైన మలయాళీ బ్యూటీ కల్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'కొత్త లోక: చాప్టర్ 1 చంద్ర'. ఈ మూవీకి డొమినిక్ అర్జున్ దర్శకత్వం వహించగా... ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి.
సూపర్ హీరోగా కల్యాణి ప్రియదర్శన్
'కొత్త లోక: చాప్టర్ 1 చంద్ర' మూవీలో కల్యాణి ప్రియదర్శన్ సూపర్ హీరోగా నటిస్తున్నారు. ఆమెతో పాటు ప్రేమలు ఫేం నస్లెన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సినిమాలో దుల్కర్ సల్మాన్, టొవినో థామస్ గెస్ట్ రోల్స్ చేసినట్లు తెలుస్తోంది. మూవీని ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్ తన నిర్మాణ సంస్థ 'వేఫేరర్ ఫిల్మ్స్' బ్యానర్‌పై నిర్మించారు. ఈ సూపర్ హీరో ఫాంటసీ థ్రిల్లర్ డ్రామా మూవీ ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తెలుగులో...
ఈ మూవీని తెలుగులో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత నాగవంశీ రిలీజ్ చేయనున్నారు. ఏపీ, తెలంగాణలో ఈ నెల 28న మూవీని తెలుగులో రిలీజ్ చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. 'వారు మన మధ్య నివసిస్తున్నారు. ఇప్పుడు ప్రపంచం వారి గురించి తెలుసుకుంటుంది.' అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
Also Read: ఇది కదా అసలైన మాస్ పంచ్ - బాబీ చిరు న్యూ మూవీ కాన్సెప్ట్ వేరే లెవల్
వార్ 2 తర్వాత
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ రీసెంట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'వార్ 2' తర్వాత మలయాళ మూవీని నాగవంశీ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. 'వార్ 2' అంతగా సక్సెస్ కాకపోవడంతో ఆయనపై సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్స్ సాగాయి. సెల్ ఫోన్ స్విచ్చాఫ్ చేశారని కొందరు... ఆయన దుబాయ్ వెళ్లిపోయారని మరికొందరు నెటిజన్లు ట్రోల్స్ చేశారు. దీనికి ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 'డిసప్పాయింట్ చేసినందుకు సారీ. ఇంకో 10 - 15 ఏళ్లు ఉంది. సినిమాకు దగ్గరగా... సినిమా కోసమే ఎల్లప్పుడూ...' అంటూ ట్వీట్ చేశారు. తాజాగా... మలయాళ మూవీ 'కొత్త లోక: చాప్టర్ 1 చంద్ర'ను తెలుగులో రిలీజ్ చేస్తుండడంతో ఆసక్తి నెలకొంది.