Tamannaah Reaction On Marriage Relationship Rumours: మిల్కీ బ్యూటీ తమన్నా... పెళ్లి, రిలేషన్ షిప్ అంటూ వస్తోన్న రూమర్లపై ఘాటుగా స్పందించారు. పాక్ క్రికెటర్ అబ్దుల్ రజాక్‌ను ఆమె వివాహం చేసుకోబోతున్నారంటూ గతంలో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రచారంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె రియాక్ట్ అయ్యారు. 

ఇలాంటి రూమర్స్‌ను ఖండిస్తున్నట్లు చెప్పారు మిల్కీ బ్యూటీ. ప్రస్తుతం సోషల్ మీడియానే అన్నింటికీ కారణమని... అందులోనే ఎక్కువగా ఇలాంటి గాసిప్స్ క్రియేట్ అవుతాయని అన్నారు. ఓ జ్యువెలరీ షాప్ ప్రారంభోత్సవానికి వెళ్లిన టైంలో క్రికెటర్ అబ్దుల్‌తో కలిసి హాజరైనట్లు గుర్తు చేసుకున్నారు. అటు, టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీతో రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు కూడా రూమర్స్ రావడంపై ఆవేదన వ్యక్తం చేశారు తమన్నా. తాను విరాట్‌ను ఒకేసారి కలిశామని... ఆ టైంలో ఇలాంటి ప్రచారం జరగడం బాధ కలిగించిందని అన్నారు. ఆ తర్వాత అయన్నెప్పుడూ కలవలేదని తెలిపారు.

Also Read: పృథ్వీరాజ్‌కు నేషనల్ అవార్డు ఎందుకు రాలేదు? 'లగాన్', 'జోధా అక్బర్' దర్శకుడే కారణమా?

కొంత మాత్రమే తెలుసు

సెలబ్రిటీల జీవితాల గురించి కొంత మాత్రమే బయటకు తెలుస్తుందని... ఎవరికీ తెలియని విషయాలు ఎన్నో ఉంటాయని చెప్పారు తమన్నా. మీడియాలో ఉన్న వ్యక్తుల గురించి కొందరు ఈజీగా రూమర్స్ సృష్టించేస్తారని... దీన్ని ఆడియన్స్ కూడా అర్థం చేసుకోవాలని అన్నారు. కొన్ని రూమర్స్ తీవ్ర ఆవేదన కలిగిస్తాయని... వాటిని సృష్టించేవారు ఆలోచించుకోవాలని హితవు పలికారు.

అయితే, 2023లో 'లస్ట్ స్టోరీస్ 2' వెబ్ సిరీస్ టైంలో బాలీవుడ్ హీరో విజయ్ వర్మతో లవ్‌లో పడ్డారు తమన్నా. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆమె కన్ఫర్మ్ చేయగా... దాదాపు రెండేళ్లు ఇద్దరూ కలిసే ఈవెంట్లకు హాజరయ్యారు. 'లవ్ బర్డ్స్'గా ట్యాగ్ సొంతం చేసుకున్న వీరి మధ్య రిలేషన్ షిప్ బ్రేక్ అయ్యిందంటూ కొంతకాలం క్రితం మీడియా, సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. పెళ్లి, కెరీర్ విషయంలో ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయని... అందుకే బ్రేకప్ నిర్ణయం తీసుకున్నారనే టాక్ వినిపించింది. చాలాకాలం ఇది కొనసాగినా అటు విజయ్ కానీ ఇటు తమన్నా కానీ దీనిపై వ్యక్తిగతంగా ఇద్దరూ స్పందించలేదు.

ఆ తర్వాత సోషల్ మీడియా వేదికగా, పలు ఇంటర్వ్యూల్లోనూ ఈ విషయంపై ఎక్కడా రియాక్ట్ కాలేదు తమన్నా. ఆ ప్రశ్న ఎదురైనా దాటవేసేవారు. ఆ తర్వాత సందేశాత్మక పోస్టులతో ఈ వార్తలకు బలం చేకూరేలా చేశారు. ఈ రూమర్స్ వచ్చిన కొద్ది రోజులకు... 'జీవితంలో అద్భుతాలు జరగాలని ఎవరూ ఎదురుచూడొద్దు. మనమే అద్భుతాలు సృష్టించాలి.' అంటూ సందేశాత్మక పోస్ట్ చేయడం వైరల్‌గా మారింది. ఆ తర్వాత పలు వేడుకల్లోనూ విజయ్, తమన్నా ఇద్దరూ వేర్వేరుగా హాజరయ్యేవారు. ఇప్పటికీ బ్రేకప్‌పై క్లారిటీ రాలేదు.

ఇక, సినిమాల విషయానికొస్తే... తమన్నా లాస్ట్‌గా 'ఓదెల 2'లో నటించారు. ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తోన్న 'వీవీఎన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్' మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాకు దీపక్ మిశ్రా, అరుణభ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.